కొంగారెడ్డిపల్లిలో నూతనంగా నిర్మించిన శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయం మహాకుంభాభిషేక మహోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన తొలి పూజా కార్యక్రమంలో చిత్తూరు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త ఎంసీ విజయానంద రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధి, ప్రజల సుఖశాంతుల కోసం స్వామివారిని ప్రార్థించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహోత్సవాన్ని విజయవంతం చేశారు. వేద పండితులు వేదమంత్రోచ్చారణల మధ్య పూజా కార్యక్రమాలను నిర్వహించారు.



