కూటమి పాలనలో రైతుల సంక్షేమం పూర్తిగా గాలిలోనే ఉండిపోయిందని ప్రకటనలు తప్ప ఫలితం లేదని కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు.
రాయలసీమ ఎత్తిపోతల పథకం సాధనే లక్ష్యంగా నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో గురువారం సోమశిల ప్రాజెక్టును పార్టీ ముఖ్య నాయకులతో కలిసి ఆయన సందర్శించారు. ప్రాజెక్టు సందర్శన అనంతరం ఏర్పాటు చేసిన రైతుల సమావేశంలో .
రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ధ్యేయంగా ఆనాటి మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలను అనుసరించి, తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాయలసీమ ఎత్తిపోతల పథకం కోసం ఎంతో కృషి చేశారని ప్రతాప్ రెడ్డి గుర్తుచేశారు.
రైతులకు సకాలంలో సాగునీరు అందించడం,పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం,రైతు భరోసాను సకాలంలో నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయడంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎల్లప్పుడూ ముందుండేవారని కొనియాడారు*
ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేసిందని రామిరెడ్డి మండిపడ్డారు.ఇరిగేషన్ ప్రాజెక్టులను పట్టించుకోకుండా, రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించకుండా కూటమి నాయకులు కాలయాపన చేస్తూ రైతుల పట్ల క్రూరత్వాన్ని ప్రదర్శిస్తుందని,అదేవిధంగాకూటమి ప్రభుత్వ పెద్దల అండదండలతో వారి అనుచర గణం రైతులకు సకాలంలో యూరియా నిల్వలు అందకుండా చేసి వాటిని బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటూ రైతులకు అన్యాయం చేస్తుందని ధ్వజమెత్తారు.*
రైతుల సంక్షేమం కోసం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని,కూటమి ప్రభుత్వం రైతులకు సకాలంలో సాగునీరు, గిట్టుబాటు ధరలు కల్పించకపోయినా, ఎన్నికల హామీ మేరకు రైతు భరోసా అందించకపోయినా.. వైఎస్సార్సీపీ రైతుల పక్షాన నిలబడి పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని,రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి రైతుల హక్కుల కోసం కూటమి ప్రభుత్వాన్ని నిలదీసేందుకు పార్టీ శ్రేణులు, రైతులు సిద్ధం కావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.



