*గోనెగండ్ల: గోనెగండ్ల మండలం కున్నూర్ గ్రామంలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త మాదిగ ఆదాము గారి కుటుంబాన్ని కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు భాస్కర్ల చంద్రశేఖర్ గారు పరామర్శించారు.*
*_ఈ సందర్భంగా ఆదాము గారి చిత్రపటానికి నివాళులు అర్పించి, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం కుటుంబానికి రూ.10,000 ఆర్థిక సహాయం అందించారు._* కార్యకర్తల కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ఎలాంటి కష్టసమయంలోనైనా తోడుగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.
ఆదాము గారి ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భాస్కర్ల చంద్రశేఖర్ గారు ప్రార్థించారు.
*_💛🚲 కార్యకర్త కష్టంలో ఉంటే… శేఖర్ అన్న ముందుంటారు!_*



