Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అనకాపల్లి

కార్మిక హక్కుల కోసం డిసెంబర్ 1న చలో ఢిల్లీ.. సీఐటీయూ పిలుపు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కార్మిక హక్కుల కోసం డిసెంబర్ 1న చలో ఢిల్లీ.. సీఐటీయూ పిలుపు

వార్త ముఖ్యాంశాలు

  • కార్మిక సమస్యల పరిష్కారానికి దేశవ్యాప్త ఉద్యమం జయప్రదం చేయాలి: ఆర్.
  • శంకర్రావు అచ్చుతాపురం: కార్మికుల హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారమే లక్ష్యంగా డిసెంబర్ 1న నిర్వహించనున్న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.
  • శంకర్రావు పిలుపునిచ్చారు.

కార్మిక సమస్యల పరిష్కారానికి దేశవ్యాప్త ఉద్యమం జయప్రదం చేయాలి: ఆర్. శంకర్రావు

అచ్చుతాపురం: కార్మికుల హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారమే లక్ష్యంగా డిసెంబర్ 1న నిర్వహించనున్న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్. శంకర్రావు పిలుపునిచ్చారు. అచ్చుతాపురంలో మండల కార్యదర్శి కె. సోమునాయుడు అధ్యక్షతన సీఐటీయూ మండల కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా శంకర్రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లు కార్మికుల హక్కులకు భంగం కలిగిస్తున్నాయని విమర్శించారు. 12 ఏళ్లుగా కార్మికుల వేతనాలు పెరగకపోగా నిత్యావసర ధరలు పెరిగి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. షెడ్యూల్డ్ పరిశ్రమల్లో 15 ఏళ్లుగా వేతనాల జీవోలు సవరించలేదని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తున్నారని పేర్కొన్నారు. అసంఘటిత రంగ కార్మికులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలపై పోరాటానికి జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో కార్మికులు ఢిల్లీకి తరలిరావాలని కోరారు.ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్. రాము, గొర్లి సత్తిబాబు, సత్యనారాయణ, లాలం వాసు, ఎల్. మాధురి, రాజన లక్ష్మి, రమణ, కె. పైడిరాజు, గోవిందరావు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

వార్తా మూలాలు

  • Punnami Reportingపత్రిక / వెబ్‌సైట్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *