పున్నమి ప్రతి నిధి
ఖమ్మం
శివభక్తులకు శుభవార్త. పరమశివుని అనుగ్రహం పొందేందుకు 42 రోజుల శివాలయ దర్శనం ఆచరణ విధానం వివరాలు భక్తులకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. భక్తి, నియమం, శ్రద్ధతో ఈ పుణ్య కార్యక్రమం చేపట్టినవారికి ఆధ్యాత్మిక శాంతి, శివకృప లభిస్తుందని పండితులు చెబుతున్నారు.
రేపట్నుంచి ప్రారంభమయ్యే ఈ 42 రోజుల శివాలయ దర్శనంలో భక్తులు బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేసి, పౌరాణిక పద్దతిలో భూషణం, భూమాషణం, మానసాహారం చేయకుండా నియమ నిష్టలతో ఉపవాసం పాటించాలి. ఉదయం, సాయంత్రం భక్తితో శివనామ స్మరణ, అష్టోత్తర శతనామ పఠనం, మహామృత్యుంజయ మంత్ర జపం చేయడం ద్వారా శివకృప పొందవచ్చు.
ప్రతి రోజూ శివాలయానికి వెళ్ళి పూజలు, అభిషేకాలు చేసి, మీ ఇంటి వద్ద ఉన్న దేవతా విగ్రహాలకు కూడా నమస్కారం చేయడం మంచిదని ఆచార్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా 9వ రోజు నుండి 42వ రోజు వరకు కఠినంగా నియమాలు పాటిస్తే శివభక్తికి ప్రత్యేక ఫలితాలు దక్కుతాయి.
శివనామ జపం, ఉపవాసం, దానం వంటి సత్కార్యాలు ఈ కాలంలో చేయడం శ్రేయస్కరం. శివపూజ అనంతరం అన్యదేవతారాధన చేయకుండా, పరమశివుడి స్మరణతో జీవనం సాగించడం భక్తి పరమార్థం అని గ్రంథాలు చెబుతున్నాయి.
ముఖ్యంగా 5వ రోజు నుండి 10వ రోజు వరకు శివనామ స్మరణలో ఎక్కువ సమయం గడపాలని, ఇది ప్రాణాంతక సమస్యలకూ దివ్య పరిష్కారమని పండితులు పేర్కొంటున్నారు.
42 రోజుల శివారాధనలో ఆచరించే నియమాలు భక్తిని పెంపొందించడమే కాక, మనసుకు ప్రశాంతతను, జీవితంలో సౌఖ్యాన్ని అందిస్తాయి. ఈ పుణ్యకాలంలో భక్తులు భగవంతుని ఆశీర్వాదంతో ఆధ్యాత్మిక పరిపూర్ణతను పొందవచ్చు.


