క్రీడా ప్రాధికార సంస్థ (వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్), హైదరాబాద్ వారి ఆదేశానుసారం, జిల్లా కలెక్టర్ గారి అనుమతితో జిల్లా కలెక్టర్ కార్యాలయ మీటింగ్ హాల్ నందు జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలను శుక్రవారం జిల్లా యువజన మరియు క్రీడల శాఖ అధికారి ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్ చంద్ గారి జయంతిని పురస్కరించుకుని, కలెక్టరేట్ పరిపాలన అధికారి (AO) శ్రీనివాస్ మరియు జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ నవీన్ రెడ్డి గార్లు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశ క్రీడారంగానికి ధ్యాన్ చంద్ చేసిన సేవలను ఈ సందర్భంగా వారు స్మరించుకున్నారు.
ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ కార్యాలయ సిబ్బంది, స్థానిక క్రీడాకారులు మరియు క్రీడాభిమానులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

కలెక్టరేట్‌లో ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు
క్రీడా ప్రాధికార సంస్థ (వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్), హైదరాబాద్ వారి ఆదేశానుసారం, జిల్లా కలెక్టర్ గారి అనుమతితో జిల్లా కలెక్టర్ కార్యాలయ మీటింగ్ హాల్ నందు జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలను శుక్రవారం జిల్లా యువజన మరియు క్రీడల శాఖ అధికారి ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్ చంద్ గారి జయంతిని పురస్కరించుకుని, కలెక్టరేట్ పరిపాలన అధికారి (AO) శ్రీనివాస్ మరియు జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ నవీన్ రెడ్డి గార్లు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశ క్రీడారంగానికి ధ్యాన్ చంద్ చేసిన సేవలను ఈ సందర్భంగా వారు స్మరించుకున్నారు. ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ కార్యాలయ సిబ్బంది, స్థానిక క్రీడాకారులు మరియు క్రీడాభిమానులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

