శ్రీ కాళహస్తి, సెప్టెంబర్ 01, (పున్నమి న్యూస్): దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న వెలిగొండ ప్రాజెక్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతులమీదుగా ప్రారంభం కావడం కరువు ప్రాంతాల ప్రజల పాలిట ఒక చారిత్రక రోజని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ ప్రాంతాల్లో సాగునీరు, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుందని ఆయన పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం పనులు పూర్తి కాకుండానే ఎన్నికల ముందు నామమాత్రంగా ప్రారంభోత్సవం చేసిందని విమర్శించిన ఆయన, చంద్రబాబు ప్రభుత్వం మిగిలిన పనులన్నీ పూర్తి చేసి నిజమైన రీతిలో ప్రజలకు ప్రాజెక్టును అందుబాటులోకి తెచ్చిందని స్పష్టం చేశారు. పట్టిసీమతో కృష్ణా డెల్టాను, వెలిగొండతో కరువు ప్రాంతాలను ఆదుకున్న చంద్రబాబు.. రేపు పోలవరంతో రాష్ట్ర భవిష్యత్తుకు పూర్తి జల భద్రత కల్పిస్తారని సుధీర్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు నీరు చివరి ఆయకట్టు వరకు చేరి, రైతులకు పూర్తి ప్రయోజనం అందేలా ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఆయన వివరించారు.

కరువు ప్రాంతాల ప్రజలకు వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభం ఒక చారిత్రక ఘట్టం-ఎమ్మెల్యే బొజ్జల