శ్రీ కాళహస్తి, జూన్ 15, (పున్నమి న్యూస్) : శ్రీకాళహస్తి మండలంలోని కమ్మకొత్తూరు గ్రామానికి అనాదిగా ఉన్న శ్మశాన వాటిక సమస్యను తక్షణమే పరిష్కరించాలని సీపీఎం శ్రీకాళహస్తి ప్రాంతీయ కార్యదర్శి గంధం మణి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) ఆధ్వర్యంలో కమ్మకొత్తూరు గ్రామ ప్రజలతో కలిసి సోమవారం స్థానిక ఆర్డీవో కార్యాలయం వద్ద భారీ ఆందోళన చేపట్టారు. ఈ నిరసనకు మద్దతు తెలిపిన అనంతరం గంధం మణి మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి దశాబ్దాలు గడుస్తున్నా నేటికీ దళితవాడలు శ్మశానాలకు నోచుకోకపోవడం విచారకరమన్నారు. గ్రామం ఏర్పడి 150 ఏళ్లు దాటినా, సుమారు 200 కుటుంబాలకు అంత్యక్రియలు నిర్వహించుకోవడానికి సరైన స్థలం, దారి లేక అంతిమ సంస్కారాల సమయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల కింద శ్మశాన స్థలాన్ని సమీకరించి, మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీవో కార్యాలయ ఏవోకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ నాయకులు అంగేరి పుల్లయ్య, పెనగడం గురవయ్య, బాలగురవయ్య, కృష్ణయ్య, టీ.గురవయ్య, గురునాధం, రాజా, సుబ్రమణ్యం, గున్నయ్య, శివప్రసాద్, హరేరామయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

కమ్మకొత్తూరు శ్మశాన సమస్యను పరిష్కరించాలి-సీపీఎం డిమాండ్