* మాచర్ల నియోజకవర్గ ప్రతినిధి
ఏపీఆర్జేసీ, నాగార్జునసాగర్‌లో *మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీట్ (MPTM 4.0)* కార్యక్రమం కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎం. హేమాంబర రెడ్డి అధ్యక్షతన ఘనంగా నిర్వహించబడింది.విద్యార్థుల విద్యా ప్రగతి, క్రమశిక్షణ, తల్లిదండ్రులు ఉపాధ్యాయుల భాగస్వామ్యాన్ని బలోపేతం చేయాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.అతిథులు, బహుమతుల పంపిణీ
ఈ కార్యక్రమానికి టీడీపీ మండల అధ్యక్షుడు *ఎన్. వీరస్వామి*, విజయపురి సౌత్ టీడీపీ నాయకులు బొల్లా చౌదరి, డా. బసివి రెడ్డి, చంద్రశేఖర్, సత్తిబాబు, అప్పలరాజు, పవన్ కుమార్, అలాగే ఏపీఆర్జేసీ పూర్వ విద్యార్థి రమేష్ నాయుడు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారు విద్యార్థులకు పుస్తకాలు, కార్పెట్లు, బెడ్షీట్లు పంపిణీ చేసి విద్యార్థుల సంక్షేమానికి తమ వంతు సహకారాన్ని అందించారు.తల్లిదండ్రుల ఆటల పోటీలు
ఈ సందర్భంగా తల్లిదండ్రుల కోసం నిర్వహించిన వివిధ ఆటల పోటీలలో వారు ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలకు అతిథులు అభినందనలు తెలియజేసి బహుమతులు అందజేశారు.ప్రిన్సిపాల్ ప్రసంగం
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డా. ఎం. హేమాంబర రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు, ప్రజాప్రతినిధుల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని క్రమశిక్షణతో చదివి సమాజానికి ఆదర్శప్రాయులుగా ఎదగాలని సూచించారు.ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


