ఎద్దుల బండిపై వినూత్న నిరసన.. పెట్రోల్ ధరలు తగ్గించాలంటూ మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఆందోళన
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగనన్న పిలుపు మేరకు ఉదయగిరిలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ వైసీపీ ఇన్చార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఎద్దుల బండిపై వినూత్న నిరసన చేపట్టారు. భారీ ర్యాలీలో వందలాది మంది నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం స్థానిక తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను మర్చిపోయిందని విమర్శించారు. పెట్రోల్, డీజిల్‌తో పాటు నిత్యావసరాల ధరలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించకపోతే ప్రజలతో కలిసి ఉద్యమాలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఎద్దుల బండిపై వినూత్న నిరసన.. పెట్రోల్ ధరలు తగ్గించాలంటూ మేకపాటి రాజగోపాల్
ఎద్దుల బండిపై వినూత్న నిరసన.. పెట్రోల్ ధరలు తగ్గించాలంటూ మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఆందోళన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగనన్న పిలుపు మేరకు ఉదయగిరిలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ వైసీపీ ఇన్చార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఎద్దుల బండిపై వినూత్న నిరసన చేపట్టారు. భారీ ర్యాలీలో వందలాది మంది నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం స్థానిక తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను మర్చిపోయిందని విమర్శించారు. పెట్రోల్, డీజిల్‌తో పాటు నిత్యావసరాల ధరలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించకపోతే ప్రజలతో కలిసి ఉద్యమాలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

