నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం ఇనుకుర్తి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
ఉమ్మడి నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం ఇనుకుర్తి పెట్రోలు బంకు వద్ద డేగపూడి గ్రామానికి చెందిన తాళ్లూరు రవీంద్ర (41) అనే వ్యక్తి సొంత పనుల నిమిత్తం పొదలకూరుకు వస్తుండగా పొదలకూరు నుండి రాపూరుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో రవీంద్ర అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు.సమాచారం అందుకున్న సీఐ వెంకట్రావు, ఎస్ఐ హనీఫ్ సంఘటన ప్రదేశానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


