ఉపాధ్యాయుడి బదిలీకి ఉద్వేగభరిత వీడ్కోలు..!
మర్రిపాడు మండలం చుంచులూరు ఉన్నత పాఠశాలలో 9 సంవత్సరాలు సేవలందించిన జీవశాస్త్ర ఉపాధ్యాయుడు అశోక్ బదిలీపై వెళ్లడంతో సన్మాన కార్యక్రమంలో విద్యార్థులు భావోద్వేగానికి గురై బోరున విలపించారు. ఆయన బోధన శైలితో విద్యార్థుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ఉపాధ్యాయుడిగా గ్రామస్తులు, ఉపాధ్యాయులు ప్రశంసల వర్షం కురిపించారు.