ఉదయగిరి మండలంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల గ్రంథాలయాలకు ఏపీ ప్రభుత్వ గౌరవ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు రచించిన ‘విలువల విద్య’, ‘డ్రగ్స్ వద్దు బ్రో’ పుస్తకాలను అందజేసినట్లు ఎంఈవోలు టి.వెంకటేశ్వర్లు, టి.శ్రీనివాసులు తెలిపారు. విద్యార్థుల్లో నైతిక విలువలు, మంచి అలవాట్లు పెంపొందించడంతో పాటు మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించేందుకు ఈ పుస్తకాలను పాఠశాల గ్రంథాలయాల్లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. విద్యార్థులు పుస్తకాలను సద్వినియోగం చేసుకుని వాటిలోని విషయాలను జీవితంలో ఆచరించాలని సూచించారు. అలాగే పాఠశాలల విద్యా కార్యకలాపాలకు ఉపయోగపడే అకడమిక్ క్యాలెండర్లను కూడా ఆయా పాఠశాలలకు అందజేసినట్లు తెలిపారు. ఈ పుస్తకాల ద్వారా విద్యార్థుల్లో బాధ్యతాయుతమైన ప్రవర్తన, సామాజిక చైతన్యం పెంపొందుతాయని వారు పేర్కొన్నారు.

ఉదయగిరి : స్కూల్స్ లైబ్రరీలకు విలువల విద్య పుస్తకాలు