ఉదయగిరిలోని SMGR ప్రభుత్వ వ్యవసాయ కళాశాలలో సర్దార్ గౌతు లచ్చన్న 117వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ టి. గోపికృష్ణ లచ్చన్న చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్య ఉద్యమంలో లచ్చన్న పోషించిన కీలక పాత్రను గుర్తు చేశారు. రైతాంగ సమస్యలపై పోరాటం, జమీందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్యమం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. లచ్చన్న ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొని ఘన నివాళులు అర్పించారు

ఉదయగిరిలో ఘనంగా సర్దార్ గౌతు లచ్చన్న 117వ జయంతి