*ఇబ్రహీంపట్నం, పవిత్ర సంగమం వద్ద కృష్ణమ్మలో కలిసిన పట్టిసీమ నుంచి విడుదల చేసిన గోదావరి జాలాలు.*
ఇబ్రహీంపట్నం – పున్నమి ప్రతినిధి(జూలై 09) : ఇబ్రహీంపట్నం లోని పవిత్ర సంగమం దగ్గర గోదావరి జాలాలకు జలహారతి ఇచ్చి పసుపు, కుంకుమతోపాటు చీర, సారెలను సమర్పించిన మంత్రి నిమ్మల రామానాయుడు, ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్, కలెక్టర్ లక్ష్మీ షా, టిడిపి రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి జంపాల సీతారామయ్య, కొండపల్లి మునిసిపాలిటీ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో నదులు అనుసంధానం చేసిన అపర భగీరథుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్న ఎంపీ కేశినేని శివనాథ్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూర దృష్టికి నిదర్శనమే ఫెర్రి ఘాట్ పవిత్ర సంగమం. కృష్ణ గోదావరి నదులను అనుసంధానం చేసిన విజనరీ లీడర్ సీఎం చంద్రబాబు. జగన్ పట్టిసీమను వట్టి సీమ చేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నదులకు జలకల సంతరించేలా చర్యలు చేపట్టారు. గోదావరి కృష్ణా నదులు అనుసంధానం వల్ల కృష్ణ డెల్టా దిగువ బాగాన ప్రజలు, రైతులకు అవసరమైన తాగునీరు కష్టాలు తీరాయన్నారు.
భారీనీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామా నాయుడు మాట్లాడుతూ రూ.1300 కోట్లతో పట్టిసీమ నిర్మిస్తే, 2014-19 లో పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు కృష్ణా డెల్టాకు తరలించడం ద్వారా రూ 50 వేల కోట్ల ఆదాయం వచ్చింది. 2014-19 లో 5 ఏళ్లలో 263 టీఎంసీ లకు పైగా గోదావరి జలాలు కృష్ణ డెల్టాకు తరలించాం. ఇది శ్రీశైలం పూర్తి నీటి నిల్వ సామర్థ్యం కంటే ఎక్కువ. ఇప్పటి వరకు పట్టిసీమ ద్వారా 428 కు పైగా టీఎంసీ లను కృష్ణాకు తరలించాం. ఇది నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం కంటే ఎక్కువ. నాడు టీడీపీ హయాంలో 1040 లిఫ్ట్ స్కీమ్స్ ద్వారా సాగు నీరందిస్తుంటే, వైసీపీ హయాంలో సరైన నిర్వహణ లేకపోవడం వల్ల 450 లిఫ్ట్ లు మరుగున పడ్డాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటర్ మేనేజ్మెట్ ద్వారా అన్ని రిజర్వాయర్లలో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయగలిగాం. రాష్ట్ర విభజన వల్ల జరిగిన నష్టం కంటే, జగన్ పాలన వల్లే ఎక్కువ నష్టం జరిగింది. వెంటిలేటర్ మీద ఉన్న ఆర్ధిక వ్యవస్థ కు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోదీల సహకారంతో ఆక్సిజన్ ఇచ్చి ఊపిరి పోస్తున్నారు.


