తిరుపతి ఆగస్టు 25 పున్నమి ప్రతినిధి
తిరుపతిలోని ఎస్వీ క్యాంపస్ స్కూల్ వాలీ బాల్ కోర్టులో ఏర్పాటు చేసిన శాశ్వత ఫ్లడ్లైట్లను మంగళవారం ఆయన ఎస్వీ యూనివర్సిటీ రిజిస్టర్ భూపతి నాయుడు , టీటీడీ బోర్డ్ సభ్యురాలు పనబాక లక్ష్మీ తో కలిసి ప్రారంభించారు.ఆగస్టు 16న శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో తిరుపతి జిల్లాకు చెందిన యువ వాలీబాల్ క్రీడా కారిణులతో రవి నాయుడు ప్రత్యేకంగా ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా క్రీడాకారిణులతో ఆత్మీయంగా ముచ్చటించి, వారి క్రీడా ప్రస్థానం, శిక్షణలో ఎదుర్కొంటు న్న సమస్యలు, భవిష్యత్ లక్ష్యాలను తెలుసుకున్నారు.మెరుగైన శిక్షణ కోసం ఫ్లాడ్ లైట్లుతో కూడిన సింథటిక్ వాలీబాల్ కోర్ట్ కల్పించాలని క్రీడాకారిణిలు కోరారు.క్రీడాకారిణిల అభ్యర్థనలకు సానుకూలంగా స్పందించిన రవి నాయుడు , వారి సమస్యలను పరిష్కరించడంతో పాటు అవసరమైన సదుపాయాలు కల్పిస్తామని ఆగస్టు 16న హామీ ఇచ్చారు. అందులో భాగంగా ఎస్వీ యూనివర్సిటీ క్యాంపస్ స్కూల్లో శాశ్వత ఫ్లడ్లైట్లను ఏర్పాటు చేసి, మంగళవారం ప్రారంభించా రు.శాశ్వత ఫ్లడ్‌లైట్ల ఏర్పాటుతో క్రీడాకారిణి లకు సాయంత్రం, రాత్రి వేళల్లోనూ నిరంత రంగా శిక్షణ పొందే అవకాశం కలుగుతుంద ని రవి నాయుడు తెలిపారు. క్రీడాకారుల అవసరాలకు అనుగుణంగా దశలవారీగా మరిన్ని మౌలిక వసతులు, ఆధునిక క్రీడా సామగ్రి, నాణ్యమైన కోచింగ్ సదుపాయాల ను అందించేందుకు చర్యలు తీసుకుంటామ ని చెప్పారు.క్రీడాకారులకు ఇచ్చిన హామీలను కేవలం ప్రకటనలకే పరిమితం చేయకుండా, ఆచరణలో అమలు చేయడమే శాప్ లక్ష్యమని రవి నాయుడు పేర్కొన్నారు. మహిళా వాలీబాల్ క్రీడాకారిణిలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి రాష్ట్రానికి, దేశానికి పేరు తీసుకువచ్చేలా శాప్ ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా శాప్ చైర్మన్ రవి నాయుడు కి తిరుపతి జిల్లా వాలీబాల్ క్రీడాకరణీలు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో శాప్ పరిపాలన అధికారి వెంకటరమావత్ నాయక్ , శాప్ బోర్డ్ సభ్యులు రమణారావు , రజనీ , పేరం రవీంద్రనాథ్ , జగదీశ్వరి పాల్గొన్నారు.



