సీఎం చంద్రబాబు అక్రమ అరెస్టుకు మూడేళ్లు
53 కొవ్వూతుల తో టిడిపి నిరసన..!
రామచంద్రాపురం సెప్టెంబర్ 09 పున్నమి ప్రతినిధి
చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండల కేంద్రంలో టిడిపి నాయకులు నిజం గెలిచింది కార్యక్రమం నిర్వహించారు. సోమవారం రాత్రి ఏడు గంటలకు వైకాపా ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్టు చేసిన దుర్ఘటన జరిగి నేటికి సరిగ్గా మూడేళ్లు పూర్తయి. చంద్రబాబు నాయుడుని 53 రోజుల పాటు రాజమండ్రి కేంద్ర కారాగారంలో అన్యాయ నిర్బంధానికి నిరసనగా 53 క్యాండిలతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మేకల తిరుమలరెడ్డి మాట్లాడుతూ స్కిల్ డెవలప్మెంట్ లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అక్రమాలకు పాల్పడినట్లు సెప్టెంబర్ 9 2023న అర్ధరాత్రి అక్రమంగా అరెస్టు చేయడం సైకో జగన్ ప్రభుత్వానికే చెల్లిందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యమని, నీతి నిజాయితీగా ప్రజలకు నిస్వార్ధంగా ప్రజా సేవ చేయడమే ఆయన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు అవినీతికి కేరాఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి అని,….. అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి చంద్రబాబు నాయుడు కేరాఫ్ అడ్రస్ అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ టీ కేశవ నాయుడు, కే నరసింహారెడ్డి, బండి విజయ్ కుమార్ రెడ్డి, చేకూరు వెంకటప్రసాద్, కే గిరిధర్ రెడ్డి, ముని రామిరెడ్డి, సోమశేఖర్ నాయుడు, కోటేశ్వర్ రెడ్డి, ఎంపీటీసీ కే చంద్రశేఖర్ రెడ్డి, నాగ ముని యాదవ్, వెంకీ, జగదీష్ రాయల్, దళిత నాయకులు సి రవికుమార్, బాబయ్య, హరి, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


