వార్త ముఖ్యాంశాలు
- ఆర్ధిక మాంద్యంలో మన ఉద్యోగాలు కాపాడుకోవడం ఎలా ?
- పున్నమి పాఠకులకు నమస్కారములు.
- శుభోదయం.
ముఖ్య గమనిక. ఇప్పుడున్న ఆర్ధిక మాం ద్యం, మరొక 2 సంవత్సరాలు ఉంటుంది. ఈ సమయంలో, మనల్ని ఎవరు రక్షించరు! మనల్ని మనమే రక్షించుకోవాలి. మనకి కావలసిన భద్రతా భావం (సెక్యూరిటీ) మనమే కల్పించుకోవాలి. మనము, లాభార్జన ధ్యేయంగా ఉన్న కంపెనీ (ఫర్ప్రాఫిట్ కంపెనీస్)లో పని చేస్తున్నాము అనుకోండి. మనం చేసే పని, కంపెనీ యొక్క ఆదాయాన్ని, మరియు లాభాన్ని ఏ విధంగా పెంచుతుందో, మనకి అవగాహన ఉండాలి. అది లేక పోతే, మన ఉద్యోగం ఎప్పుడైనా ఊడిపోవచ్చు! ఇంకా – ‘అలంకార ప్రాయమైన ఉద్యోగాలు ‘పర్సనల్ సెక్రెటరీ, పబ్లిక్ రిలేషన్స్ మేనేజరు, కార్పొరేట్ ఇమేజ్ మేనేజరు, అడ్వర్టైజింగులో ఉన్న వారు, కంపెనీ కష్ట పరిస్థితులలో ఉంటే తమ ఉద్యోగాన్ని నిలబెట్టుకోలేరు !