Monday, 7 September 2026
  • Home  
  • ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి
- విజయనగరం 

ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి విజయనగరం జిల్లా బ్యూరో/ రమణ, సెప్టెంబర్ 06.(పున్నమి ప్రతనిది ) కొత్తవలస మండలం, గ్రామానికి చెందిన బోని వెంకటేష్ (33) రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోని శంకర్ (38) ఇచ్చిన ఫిర్యాదు మేరకు, ఆయన తమ్ముడు బోని వెంకటేష్ ఆదివారం మధ్యాహ్నం సుమారు 2.00 నుంచి 2.30 గంటల మధ్య తన యాక్టివా స్కూటీ (AP 39 RR 4092)పై ఒంటరిగా ప్రయాణిస్తున్నాడు. తుమ్మికాపల్లి నూకలమ్మ గుడి సమీపానికి చేరుకునే సరికి దేవరాపల్లి నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఏపీఎస్‌ఆర్టీసీ 68D బస్సు (AP 39 TE 1166) వేగంగా, అజాగ్రత్తగా రాంగ్ రూట్‌లో వచ్చి స్కూటీని ఢీకొట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో వెంకటేష్ తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై బోని శంకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొత్తవలస పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం తదితర అంశాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

విజయనగరం జిల్లా బ్యూరో/ రమణ, సెప్టెంబర్ 06.(పున్నమి ప్రతనిది )

కొత్తవలస మండలం, గ్రామానికి చెందిన బోని వెంకటేష్ (33) రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోని శంకర్ (38) ఇచ్చిన ఫిర్యాదు మేరకు, ఆయన తమ్ముడు బోని వెంకటేష్ ఆదివారం మధ్యాహ్నం సుమారు 2.00 నుంచి 2.30 గంటల మధ్య తన యాక్టివా స్కూటీ (AP 39 RR 4092)పై ఒంటరిగా ప్రయాణిస్తున్నాడు. తుమ్మికాపల్లి నూకలమ్మ గుడి సమీపానికి చేరుకునే సరికి దేవరాపల్లి నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఏపీఎస్‌ఆర్టీసీ 68D బస్సు (AP 39 TE 1166) వేగంగా, అజాగ్రత్తగా రాంగ్ రూట్‌లో వచ్చి స్కూటీని ఢీకొట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ ప్రమాదంలో వెంకటేష్ తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

ఘటనపై బోని శంకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొత్తవలస పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం తదితర అంశాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.