Sunday, 13 September 2026
  • Home  
  • ఆరూరు విద్యార్థుల చదువుకు ‘సైన్స్’ గ్రహణం!*_
- తిరుపతి

ఆరూరు విద్యార్థుల చదువుకు ‘సైన్స్’ గ్రహణం!*_

📌 _*బదిలీతో ఖాళీ నియామకంతో ఆలస్యం ఆరూరు విద్యార్థులకే నష్టం!*_ 📌 _*సైన్స్ టీచర్ కోసం నెల రోజులుగా విద్యార్థుల ఎదురుచూపులు!*_ 📌_*“మా పిల్లల భవిష్యత్తు ఏంటి?” ఆరూరులో తల్లిదండ్రుల ఆవేదన!*_ 📌 _*పాఠశాలలో సైన్స్ టీచర్ ‘నో ఎంట్రీ’ విద్యార్థుల చదువుకు బ్రేక్!*_ 📌 _*అధికారుల దృష్టికి వెళ్లినా ఆరూరు విద్యార్థులకు తప్పని టీచర్ కష్టాలు!*_ 📌_*పేద పిల్లల చదువుకు ఎవరు దిక్కు? ఆరూరు పాఠశాలలో సైన్స్ టీచర్ కొరత!*_ _*చిట్టమూరు మండలం ఆరూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత నెల రోజులుగా బయాలజీ,సైన్స్ ఉపాధ్యాయుడు లేక విద్యార్థుల చదువుకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పాఠశాలలో పనిచేస్తున్న సైన్స్ ఉపాధ్యాయుడిని వేరే పాఠశాలకు బదిలీ చేసినప్పటికీ ఆయన స్థానంలో ఇప్పటివరకు మరో ఉపాధ్యాయుడిని నియమించకపోవడం విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తోంది.ఈ విషయాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జి.వి.ఎస్. లక్ష్మి, తోటి ఉపాధ్యాయులు సంబంధిత ఎంఈఓ, డీఈఓ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అయినప్పటికీ నెల రోజులు గడుస్తున్నా సమస్య పరిష్కారం కాకపోవడంపై తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కీలకమైన సైన్స్ సబ్జెక్టుకు ఉపాధ్యాయుడు లేకపోవడంతో విద్యార్థులు పాఠాలు ఎలా నేర్చుకోవాలంటూ ప్రశ్నిస్తున్నారు.ఆరూరు గ్రామ పరిధిలోని విద్యార్థుల్లో పేద, బడుగు, బలహీన వర్గాల కుటుంబాలకు చెందిన వారు అధికంగా ఉన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో చదివించే ఆర్థిక స్థోమత లేని కుటుంబాలకు ప్రభుత్వ పాఠశాలే ప్రధాన ఆధారం. అలాంటి పాఠశాలలో సైన్స్ టీచర్ లేకపోవడంతో తమ పిల్లల విద్యా భవిష్యత్తు దెబ్బతినే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.మా పిల్లలకు పాఠాలు ఎవరు చెబుతారు మా పిల్లల భవిష్యత్తు ఏంటి? అంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయుడిని బదిలీ చేసిన వెంటనే ప్రత్యామ్నాయంగా మరో ఉపాధ్యాయుడిని ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ ఇంతకాలం పట్టించుకోకపోవడం పట్ల వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని విద్యాశాఖ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఆరూరు జెడ్పీ ఉన్నత పాఠశాలకు అర్హత కలిగిన సైన్స్ ,బయాలజీ ఉపాధ్యాయుడిని తక్షణమే నియమించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇకనైనా ఆలస్యం చేయకుండా ఉపాధ్యాయుడిని ఏర్పాటు చేసి పేద విద్యార్థుల చదువుకు భరోసా కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.*_

📌 _*బదిలీతో ఖాళీ నియామకంతో ఆలస్యం ఆరూరు విద్యార్థులకే నష్టం!*_

📌 _*సైన్స్ టీచర్ కోసం నెల రోజులుగా విద్యార్థుల ఎదురుచూపులు!*_

📌_*“మా పిల్లల భవిష్యత్తు ఏంటి?” ఆరూరులో తల్లిదండ్రుల ఆవేదన!*_

📌 _*పాఠశాలలో సైన్స్ టీచర్ ‘నో ఎంట్రీ’ విద్యార్థుల చదువుకు బ్రేక్!*_

📌 _*అధికారుల దృష్టికి వెళ్లినా ఆరూరు విద్యార్థులకు తప్పని టీచర్ కష్టాలు!*_

📌_*పేద పిల్లల చదువుకు ఎవరు దిక్కు? ఆరూరు పాఠశాలలో సైన్స్ టీచర్ కొరత!*_
_*చిట్టమూరు మండలం ఆరూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత నెల రోజులుగా బయాలజీ,సైన్స్ ఉపాధ్యాయుడు లేక విద్యార్థుల చదువుకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పాఠశాలలో పనిచేస్తున్న సైన్స్ ఉపాధ్యాయుడిని వేరే పాఠశాలకు బదిలీ చేసినప్పటికీ ఆయన స్థానంలో ఇప్పటివరకు మరో ఉపాధ్యాయుడిని నియమించకపోవడం విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తోంది.ఈ విషయాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జి.వి.ఎస్. లక్ష్మి, తోటి ఉపాధ్యాయులు సంబంధిత ఎంఈఓ, డీఈఓ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అయినప్పటికీ నెల రోజులు గడుస్తున్నా సమస్య పరిష్కారం కాకపోవడంపై తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కీలకమైన సైన్స్ సబ్జెక్టుకు ఉపాధ్యాయుడు లేకపోవడంతో విద్యార్థులు పాఠాలు ఎలా నేర్చుకోవాలంటూ ప్రశ్నిస్తున్నారు.ఆరూరు గ్రామ పరిధిలోని విద్యార్థుల్లో పేద, బడుగు, బలహీన వర్గాల కుటుంబాలకు చెందిన వారు అధికంగా ఉన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో చదివించే ఆర్థిక స్థోమత లేని కుటుంబాలకు ప్రభుత్వ పాఠశాలే ప్రధాన ఆధారం. అలాంటి పాఠశాలలో సైన్స్ టీచర్ లేకపోవడంతో తమ పిల్లల విద్యా భవిష్యత్తు దెబ్బతినే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.మా పిల్లలకు పాఠాలు ఎవరు చెబుతారు మా పిల్లల భవిష్యత్తు ఏంటి? అంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయుడిని బదిలీ చేసిన వెంటనే ప్రత్యామ్నాయంగా మరో ఉపాధ్యాయుడిని ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ ఇంతకాలం పట్టించుకోకపోవడం పట్ల వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని విద్యాశాఖ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఆరూరు జెడ్పీ ఉన్నత పాఠశాలకు అర్హత కలిగిన సైన్స్ ,బయాలజీ ఉపాధ్యాయుడిని తక్షణమే నియమించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇకనైనా ఆలస్యం చేయకుండా ఉపాధ్యాయుడిని ఏర్పాటు చేసి పేద విద్యార్థుల చదువుకు భరోసా కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.*_

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.