Sunday, 13 September 2026
  • Home  
  • నాయుడుపేట శాంతిభద్రతల రక్షణలో సరికొత్త అధ్యాయం.*
- తిరుపతి

నాయుడుపేట శాంతిభద్రతల రక్షణలో సరికొత్త అధ్యాయం.*

*అహర్నిశలు శ్రమిస్తూ, ప్రజల గుండెల్లో నమ్మకాన్ని నింపుతున్న పోలీసులు* *నాయుడుపేట పట్టణంలో నేరాల సంఖ్య తగ్గించడంలో, శాంతిభద్రతల పరిరక్షణలో రాజీలేని వైఖరిని అవలంబిస్తూ, ప్రజల స్వేచ్ఛాయుత జీవనానికి భరోసాగా నిలుస్తున్నారు పోలీస్ అధికారులు. పట్టణ రక్షణే ఏకైక ధ్యేయంగా, విశ్రాంతిని సైతం పక్కనబెట్టి అహర్నిశలు శ్రమిస్తున్న నాయుడుపేట పోలీసుల పటిష్ట పనితీరుపై ఒక ప్రత్యేక కథనం.* *నాయుడుపేట, సెప్టెంబర్ 11,పున్నమి న్యూస్:* *లా అండ్ ఆర్డర్‌లో రాజీలేని పోలీస్ పవర్ – డీఎస్పీ చెంచుబాబు* *నాయుడుపేట సబ్ డివిజన్‌ను నేరరహిత ప్రాంతంగా మార్చడంలో డివిజనల్ పోలీస్ అధికారి చెంచుబాబు వ్యూహాత్మక చొరవ అభినందనీయం. శాంతిభద్రతల అమలులో ఎక్కడా రాజీ పడకుండా, చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై ఆయన ఉక్కుపాదం మోపుతున్నారు. అసాంఘిక శక్తులకు సింహస్వప్నంగా నిలుస్తూ, సామాన్య ప్రజలకు “మేమున్నాం” అనే కొండంత ధైర్యాన్ని ఇస్తూ నాయుడుపేటలో ఖాకీ పవర్‌ను సరికొత్తగా చాటిచెప్తున్నారు.* *సైబర్ నేరాలపై డేగ కన్ను & గంజాయి రవాణాపై ఉక్కుపాదం* *సాంకేతికతను ఆసరాగా చేసుకుని విరుచుకుపడుతున్న సైబర్ నేరగాళ్ల ఆట కట్టించడానికి నాయుడుపేట పోలీసులు ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆన్‌లైన్ మోసాల పట్ల ప్రజలను అప్రమత్తం చేస్తూ, సైబర్ క్రిమినల్స్ నెట్‌వర్క్‌ను ఛేదిస్తున్నారు. మరోవైపు, యువత భవిష్యత్తును చిదిమేస్తున్న గంజాయి మరియు మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నారు. రవాణా మార్గాలను బ్లాక్ చేస్తూ, మత్తు పదార్థాల విక్రయదారుల గుండెల్లో వణుకు పుట్టిస్తున్నారు.* *”భవిష్యత్తును వెలిగించుకోండి, వివాదాలకు దూరంగా ఉండండి”: సీఐ వెంకటేశ్వర్లు.* *యువత బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని నాయుడుపేట పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. విద్యార్థులు మాదకద్రవ్యాల బారిన పడకుండా, వివాదాలకు, గొడవలకు బానిసలు కాకుండా తమ చదువుపై దృష్టి పెట్టాలని ఆయన ప్రత్యేక కౌన్సిలింగ్ కార్యక్రమాల ద్వారా హితవు పలికారు. విద్యార్థులు ఉన్నతమైన ఆశయాలతో ఉజ్వల భవిష్యత్తును సొంతం చేసుకోవాలని, క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని అలవర్చుకోవాలని ఆయన ఆకాంక్షించారు.* *అర్ధరాత్రి వేళల్లో అప్రమత్తం – సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ శివశంకర్.* *పట్టణ ప్రజలు నిశ్చింతగా నిద్రపోతున్న వేళ, ఖాకీ రక్షకులు మాత్రం కంటిమీద కునుకు లేకుండా కాపలా కాస్తున్నారు. సీఐ వెంకటేశ్వర్లు మరియు సబ్ ఇన్స్పెక్టర్ శివశంకర్ నేతృత్వంలో ప్రత్యేక పోలీస్ బృందాలు నాయుడుపేట పట్టణంలో ప్రతిరోజు రాత్రి వేళల్లో విస్తృతంగా పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచడం, రాత్రి వేళల్లో రౌడీ షీటర్ల తనిఖీలు చేపట్టడం ద్వారా పట్టణంలో శాంతిభద్రతలను కంటికి రెప్పలా కాపాడుతున్నారు.* *అలసట నెరుగని సేవ – పట్టణ రక్షణే పరమావధి* *ఎండనక, వాననక, పగలు, రాత్రి అనే తేడా లేకుండా నిరంతరం విధుల్లో ఉండే పోలీసులు శారీరకంగా, మానసికంగా ఎంతో ఒత్తిడిని ఎదుర్కొంటారు. అయినప్పటికీ, తమ వ్యక్తిగత అలసటను పక్కనబెట్టి, “ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణే మా ప్రథమ కర్తవ్యం” అనే నినాదంతో నాయుడుపేట పోలీసులు విధి నిర్వహణలో నిమగ్నమయ్యారు. హోంగార్డు నుండి కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐలు, ఎస్ఐలు, సర్కిల్ ఇన్స్పెక్టర్, డిఎస్పి అందరూ కలిసి నాయుడుపేట ను ఒక ప్రశాంత వాతావరణ ప్రదేశంగా కీర్తికరించడానికి నిరంతరం చేస్తున్న సేవలుకు అన్ని వర్గాల ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారుల సమర్థవంతమైన పర్యవేక్షణ, క్షేత్రస్థాయి సిబ్బంది అంకితభావం వల్లే ఈరోజు నాయుడుపేట పట్టణంలో నేరాలు గణనీయంగా తగ్గాయని, ప్రజలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా జీవించగలుగుతున్నారని, సమాజ శ్రేయస్సు కోసం అహర్నిశలు శ్రమిస్తున్న నాయుడుపేట పోలీస్ సిబ్బందికి ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు.*

*అహర్నిశలు శ్రమిస్తూ, ప్రజల గుండెల్లో నమ్మకాన్ని నింపుతున్న పోలీసులు*

*నాయుడుపేట పట్టణంలో నేరాల సంఖ్య తగ్గించడంలో, శాంతిభద్రతల పరిరక్షణలో రాజీలేని వైఖరిని అవలంబిస్తూ, ప్రజల స్వేచ్ఛాయుత జీవనానికి భరోసాగా నిలుస్తున్నారు పోలీస్ అధికారులు. పట్టణ రక్షణే ఏకైక ధ్యేయంగా, విశ్రాంతిని సైతం పక్కనబెట్టి అహర్నిశలు శ్రమిస్తున్న నాయుడుపేట పోలీసుల పటిష్ట పనితీరుపై ఒక ప్రత్యేక కథనం.*

*నాయుడుపేట, సెప్టెంబర్ 11,పున్నమి న్యూస్:*

*లా అండ్ ఆర్డర్‌లో రాజీలేని పోలీస్ పవర్ – డీఎస్పీ చెంచుబాబు*

*నాయుడుపేట సబ్ డివిజన్‌ను నేరరహిత ప్రాంతంగా మార్చడంలో డివిజనల్ పోలీస్ అధికారి చెంచుబాబు వ్యూహాత్మక చొరవ అభినందనీయం. శాంతిభద్రతల అమలులో ఎక్కడా రాజీ పడకుండా, చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై ఆయన ఉక్కుపాదం మోపుతున్నారు. అసాంఘిక శక్తులకు సింహస్వప్నంగా నిలుస్తూ, సామాన్య ప్రజలకు “మేమున్నాం” అనే కొండంత ధైర్యాన్ని ఇస్తూ నాయుడుపేటలో ఖాకీ పవర్‌ను సరికొత్తగా చాటిచెప్తున్నారు.*

*సైబర్ నేరాలపై డేగ కన్ను & గంజాయి రవాణాపై ఉక్కుపాదం*

*సాంకేతికతను ఆసరాగా చేసుకుని విరుచుకుపడుతున్న సైబర్ నేరగాళ్ల ఆట కట్టించడానికి నాయుడుపేట పోలీసులు ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆన్‌లైన్ మోసాల పట్ల ప్రజలను అప్రమత్తం చేస్తూ, సైబర్ క్రిమినల్స్ నెట్‌వర్క్‌ను ఛేదిస్తున్నారు. మరోవైపు, యువత భవిష్యత్తును చిదిమేస్తున్న గంజాయి మరియు మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నారు. రవాణా మార్గాలను బ్లాక్ చేస్తూ, మత్తు పదార్థాల విక్రయదారుల గుండెల్లో వణుకు పుట్టిస్తున్నారు.*

*”భవిష్యత్తును వెలిగించుకోండి, వివాదాలకు దూరంగా ఉండండి”: సీఐ వెంకటేశ్వర్లు.*

*యువత బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని నాయుడుపేట పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. విద్యార్థులు మాదకద్రవ్యాల బారిన పడకుండా, వివాదాలకు, గొడవలకు బానిసలు కాకుండా తమ చదువుపై దృష్టి పెట్టాలని ఆయన ప్రత్యేక కౌన్సిలింగ్ కార్యక్రమాల ద్వారా హితవు పలికారు. విద్యార్థులు ఉన్నతమైన ఆశయాలతో ఉజ్వల భవిష్యత్తును సొంతం చేసుకోవాలని, క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని అలవర్చుకోవాలని ఆయన ఆకాంక్షించారు.*

*అర్ధరాత్రి వేళల్లో అప్రమత్తం – సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ శివశంకర్.*

*పట్టణ ప్రజలు నిశ్చింతగా నిద్రపోతున్న వేళ, ఖాకీ రక్షకులు మాత్రం కంటిమీద కునుకు లేకుండా కాపలా కాస్తున్నారు. సీఐ వెంకటేశ్వర్లు మరియు సబ్ ఇన్స్పెక్టర్ శివశంకర్ నేతృత్వంలో ప్రత్యేక పోలీస్ బృందాలు నాయుడుపేట పట్టణంలో ప్రతిరోజు రాత్రి వేళల్లో విస్తృతంగా పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచడం, రాత్రి వేళల్లో రౌడీ షీటర్ల తనిఖీలు చేపట్టడం ద్వారా పట్టణంలో శాంతిభద్రతలను కంటికి రెప్పలా కాపాడుతున్నారు.*

*అలసట నెరుగని సేవ – పట్టణ రక్షణే పరమావధి*

*ఎండనక, వాననక, పగలు, రాత్రి అనే తేడా లేకుండా నిరంతరం విధుల్లో ఉండే పోలీసులు శారీరకంగా, మానసికంగా ఎంతో ఒత్తిడిని ఎదుర్కొంటారు. అయినప్పటికీ, తమ వ్యక్తిగత అలసటను పక్కనబెట్టి, “ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణే మా ప్రథమ కర్తవ్యం” అనే నినాదంతో నాయుడుపేట పోలీసులు విధి నిర్వహణలో నిమగ్నమయ్యారు. హోంగార్డు నుండి కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐలు, ఎస్ఐలు, సర్కిల్ ఇన్స్పెక్టర్, డిఎస్పి అందరూ కలిసి నాయుడుపేట ను ఒక ప్రశాంత వాతావరణ ప్రదేశంగా కీర్తికరించడానికి నిరంతరం చేస్తున్న సేవలుకు అన్ని వర్గాల ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారుల సమర్థవంతమైన పర్యవేక్షణ, క్షేత్రస్థాయి సిబ్బంది అంకితభావం వల్లే ఈరోజు నాయుడుపేట పట్టణంలో నేరాలు గణనీయంగా తగ్గాయని, ప్రజలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా జీవించగలుగుతున్నారని, సమాజ శ్రేయస్సు కోసం అహర్నిశలు శ్రమిస్తున్న నాయుడుపేట పోలీస్ సిబ్బందికి ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు.*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.