తెలుగు నాటకరంగ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 16న జరుపుకుంటాము. ఆధునిక తెలుగు నాటకరంగ పితామహుడు, తొలి నాటకకర్త, దర్శకుడు కందుకూరి వీరేశలింగం పంతులు జయంతిని పురస్కరించుకుని, 2007 నుండి ప్రభుత్వం ఈ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తోంది. అయితే ప్రపంచ నాటకరంగ దినోత్సవాన్ని మాత్రం ప్రతి సంవత్సరం మార్చి 27న జరుపుతారు. గొప్ప సంఘ సంస్కర్త, మూఢనమ్మకాలపై యుద్దంప్రకటించిన కలియుగ వైతాళికుడు, బాల్యవివాహాల రద్దుకోసం ఉద్యమించిన మహోన్నతుడు కందుకూరి వీరేశలింగం పంతులు 1848 ఏప్రిల్ 16వ తేదీన రాజమండ్రిలో జన్మించారు. ఆధునిక సమాజ నిర్మాణానికి పునాదులు వేసిన మహా పురుషుడు, వితంతు వివాహాల కోసం పోరాడి, 1881లో మొదటి వితంతు వివాహాన్ని జరిపించి, తెలుగులో మొదటి నవల ‘రాజశేఖర చరిత్రము’ మొదటి స్వీయచరిత్ర, మొదటి ప్రహసనం రాసి బాలికల కోసం పాఠశాలలను స్థాపించి, స్త్రీ విద్యకు, సాధికారతకు కృషి చేసి, ‘వివేకవర్ధిని’ పత్రిక ద్వారా సమాజంలోని దురాచారాలపై పోరాటం చేయుట వలన, సంఘ సంస్కరణలు మరియు సాహిత్య సేవ కారణంగా ‘ఆధునికాంధ్ర సమాజ పితామహుడు’ గా, ‘గద్య తిక్కన’ గా పేరుపొందిన స్వర్గీయ శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారికి సమర్పిస్తున్న ఈ అక్షర సుమాంజలి
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*ఆ* ఆధునిక సమాజానికి ఆదర్శప్రాయుడు
*ధు* దురితనివారణ సామాజిక కళాకారుడు
*ని* నిబంధనలు అరాచకబంధనలు కాకూడదని
*కాం* కాంక్షలు సమున్నత జనోద్ధరణ కార్యక్రమాలుగ
*ధ్ర* ధరణి యందు వేదికైన జన విజ్ఞాన కేంద్రం
*పి* పిలుపు పలుకుల ప్రాయోజిత పర్వం
*తా* తాను విశ్వసించిన సమాజ చైతన్యం
*మ* మానవత్వ తత్వ మహిమాన్విత దీపం
*హు* హుందాతనము ప్రతిబింబించిన రూపం
*డు* డుండుగు లేని సంఘ ప్రయోజనాచార్యుడు
*కం* కంఠస్వరము కళాత్మక వరము కలవాడై
*దు* దురాచార నిర్మూలనకు కంకణబద్ధుడై
*కూ* కూడలి సమసమాజ మండలి కావాలని
*రి* రివారీగ జన విజ్ఞానసవారి సొంతం చేసుకుని
*వీ* విజ్ఞానవీరుడైన సంఘసంస్కర్త
*రే* రేయింబవళ్లు సమాజ హితం కోరి
*శ* శక్తి యుక్తి సామాజికభక్తి మిళితం చేసి
*లిం* లింగ బేధం లేని సమాజాభివృద్ధికై
*గం* గమ్యం వైపు హితకారిని సమాజం మలచి
*పం* పండితవిద్యను పామరులకు సైతం పంచిన
*తు* తులాభార సమభావ సమతౌల్య నిపుణుడు
*లు* లుప్తమయిన సమైక్యత సాహిత్య సమీక్షల విశ్లేషకుడు.
నేటికి ప్రసరిస్తున్న సామాజిక చైతన్య క్రాంతి
కందుకూరి వీరేశలింగం పంతుల జయంతి
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


