ఆదానీ పవర్ (Adani Power) సరికొత్త మైలురాయిని అందుకుంది. దేశంలో అత్యంత విలువైన కంపెనీల జాబితాలో ఇన్ఫోసిస్ (Infosys)ను అధిగమించి 11వ స్థానానికి చేరింది. ఈ ఏడాది కంపెనీ మార్కెట్ విలువ 68% వృద్ధి చెంది ₹4.85 లక్షల కోట్లకు చేరగా, ఇన్ఫోసిస్ ₹4.72 లక్షల కోట్లకు పరిమితమైంది.
బుధవారం ట్రేడింగ్‌లో ఆదానీ పవర్ షేరు 3% పెరిగి ₹252 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకింది. ఈ షేరు వారం వ్యవధిలో 13%, నెలలో 126%, ఆరు నెలల్లో 384%, ఏడాదిలో 1213% పెరిగింది. పారిశ్రామిక, గృహ అవసరాలకు విద్యుత్ డిమాండ్ పెరగడం, బొగ్గు కొరత లేకపోవడం ఈ వృద్ధికి కారణాలుగా నిలిచాయి.


