పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 8 రాజన్న సిరిసిల్ల జిల్లా ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం హైదరాబాదులో ఆందోళనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో తంగళ్ళపల్లి పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు జిల్లెల్ల గ్రామానికి చెందిన ఆశా వర్కర్లు లావణ్య బాలమణి అనితలను అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు సమస్యలు పరిష్కరించకుండా అరెస్టు చేయడం సరికాదని లావణ్య అన్నారు ప్రభుత్వం వెంటనే సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు



