భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించిన బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి
అణచివేతకు ఎదురు నిలిచి, దోపిడీకి వ్యతిరేకంగా గళమెత్తి, పేదలు, రైతులు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ జీవితం తెలంగాణ చరిత్రలో ఒక మహోన్నత అధ్యాయమని బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి అన్నారు.
చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సామాన్య మహిళగా జీవితం ప్రారంభించిన ఐలమ్మ, అసామాన్యమైన ధైర్యసాహసాలతో ప్రజా పోరాటానికి ప్రతీకగా నిలిచారని కొనియాడారు.
నాటి భూస్వామ్య వ్యవస్థలో పేదలపై జరుగుతున్న దోపిడీ, వెట్టిచాకిరీ, అణచివేతకు వ్యతిరేకంగా ఐలమ్మ తిరుగుబాటు చేసి, తన హక్కు కోసం మాత్రమే కాకుండా సమాజంలోని అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం పోరాడారని అన్నారు. ఎన్నో ఒత్తిళ్లు, బెదిరింపులు, కష్టాలు ఎదురైనా న్యాయం కోసం వేసిన అడుగు వెనక్కి వేయకుండా ధైర్యంగా నిలబడిన వీరనారి ఐలమ్మ అని పేర్కొన్నారు.
ఐలమ్మ పోరాటం ఒక వ్యక్తి పోరాటం కాదని, అది ఆత్మగౌరవం, సామాజిక న్యాయం, హక్కుల కోసం సాగిన ప్రజా పోరాటానికి ప్రతీక అని డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి అన్నారు. మహిళలు కూడా సామాజిక మార్పుకు నాయకత్వం వహించగలరని తన కార్యాచరణ ద్వారా నిరూపించిన గొప్ప స్ఫూర్తిదాయక మహిళ ఐలమ్మ అని తెలిపారు.
నేటి యువత చాకలి ఐలమ్మ జీవితాన్ని, ఆమె ధైర్యాన్ని, పోరాట పటిమను ఆదర్శంగా తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అన్యాయం ఎక్కడ కనిపించినా ప్రశ్నించే ధైర్యం, హక్కుల కోసం పోరాడే సంకల్పం, సమాజం కోసం నిలబడే సేవాభావమే చాకలి ఐలమ్మకు అందించే నిజమైన నివాళి అని అన్నారు.
చాకలి ఐలమ్మ చూపిన బాటలో నడుస్తూ సమాజంలో సమానత్వం, ఆత్మగౌరవం, సామాజిక న్యాయం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో…బిజెపి ఫ్లోర్ లీడర్ కౌన్సిలర్ జూలూరు రోజా రాణి , నర్సంపేట పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్,రూరల్ అధ్యక్షులు తనుగుల అంబేద్కర్, బిజెపి నియోజకవర్గ నాయకులు జూలూరు మనీష్ గౌడ్ ,బిజెపి మండల ప్రధాన కార్యదర్శి తాళ్లపెల్లి రాము,పట్టణ నాయకులు ఠాకూర్ విజయ్ సింగ్, కాసుల నాగేంద్రబాబు, పొనుగోటి రవీంద్ర చారి, గుంటి అరవింద్,అనిల్,గణేష్, రాజు,పట్టణ బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

అన్యాయంపై తిరుగుబాటు చేసిన ధీరవనిత చాకలి ఐలమ్మ -డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి
భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించిన బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి అణచివేతకు ఎదురు నిలిచి, దోపిడీకి వ్యతిరేకంగా గళమెత్తి, పేదలు, రైతులు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ జీవితం తెలంగాణ చరిత్రలో ఒక మహోన్నత అధ్యాయమని బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి అన్నారు. చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సామాన్య మహిళగా జీవితం ప్రారంభించిన ఐలమ్మ, అసామాన్యమైన ధైర్యసాహసాలతో ప్రజా పోరాటానికి ప్రతీకగా నిలిచారని కొనియాడారు. నాటి భూస్వామ్య వ్యవస్థలో పేదలపై జరుగుతున్న దోపిడీ, వెట్టిచాకిరీ, అణచివేతకు వ్యతిరేకంగా ఐలమ్మ తిరుగుబాటు చేసి, తన హక్కు కోసం మాత్రమే కాకుండా సమాజంలోని అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం పోరాడారని అన్నారు. ఎన్నో ఒత్తిళ్లు, బెదిరింపులు, కష్టాలు ఎదురైనా న్యాయం కోసం వేసిన అడుగు వెనక్కి వేయకుండా ధైర్యంగా నిలబడిన వీరనారి ఐలమ్మ అని పేర్కొన్నారు. ఐలమ్మ పోరాటం ఒక వ్యక్తి పోరాటం కాదని, అది ఆత్మగౌరవం, సామాజిక న్యాయం, హక్కుల కోసం సాగిన ప్రజా పోరాటానికి ప్రతీక అని డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి అన్నారు. మహిళలు కూడా సామాజిక మార్పుకు నాయకత్వం వహించగలరని తన కార్యాచరణ ద్వారా నిరూపించిన గొప్ప స్ఫూర్తిదాయక మహిళ ఐలమ్మ అని తెలిపారు. నేటి యువత చాకలి ఐలమ్మ జీవితాన్ని, ఆమె ధైర్యాన్ని, పోరాట పటిమను ఆదర్శంగా తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అన్యాయం ఎక్కడ కనిపించినా ప్రశ్నించే ధైర్యం, హక్కుల కోసం పోరాడే సంకల్పం, సమాజం కోసం నిలబడే సేవాభావమే చాకలి ఐలమ్మకు అందించే నిజమైన నివాళి అని అన్నారు. చాకలి ఐలమ్మ చూపిన బాటలో నడుస్తూ సమాజంలో సమానత్వం, ఆత్మగౌరవం, సామాజిక న్యాయం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో…బిజెపి ఫ్లోర్ లీడర్ కౌన్సిలర్ జూలూరు రోజా రాణి , నర్సంపేట పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్,రూరల్ అధ్యక్షులు తనుగుల అంబేద్కర్, బిజెపి నియోజకవర్గ నాయకులు జూలూరు మనీష్ గౌడ్ ,బిజెపి మండల ప్రధాన కార్యదర్శి తాళ్లపెల్లి రాము,పట్టణ నాయకులు ఠాకూర్ విజయ్ సింగ్, కాసుల నాగేంద్రబాబు, పొనుగోటి రవీంద్ర చారి, గుంటి అరవింద్,అనిల్,గణేష్, రాజు,పట్టణ బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

