Sunday, 21 June 2026
  • Home  
  • అన్నదాతకు అండగా కూటమి ప్రభుత్వం-బృందమ్మ
- తిరుపతి

అన్నదాతకు అండగా కూటమి ప్రభుత్వం-బృందమ్మ

తొట్టంబేడు, జూన్ 20, (పున్నమి న్యూస్) : వ్యవసాయ రంగాభివృద్ధి, రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాతృమూర్తి బొజ్జల బృందమ్మ పేర్కొన్నారు. శనివారం తొట్టంబేడు మండలం కారాకొల్లు గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని, ‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద అర్హులైన రైతులకు తొలి విడత పెట్టుబడి సాయం నగదును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ….శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని లబ్ధిదారులైన రైతుల కోసం ప్రభుత్వం తొలి విడతలో రూ.18.55 కోట్ల నిధులను విడుదల చేసిందని తెలిపారు. ఈ ఆర్థిక సాయాన్ని రైతులు వ్యవసాయ అవసరాలకు వినియోగించుకుని మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసే దిశగా పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని చెప్పారు. భవిష్యత్తులో అన్నదాతలకు మరిన్ని ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని ఆమె స్పష్టం చేశారు. కార్యక్రమంలో తొట్టంబేడు మండల టీడీపీ అధ్యక్షుడు రావిళ్ల మునిరాజానాయుడు, శ్రీకాళహస్తి మార్కెట్ కమిటీ చైర్మన్ రంగినేని చెంచయ్య నాయుడు, జయచంద్రనాయుడు, కూటమి నాయకులు, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.