Thursday, 10 September 2026
  • Home  
  • అనుమతుల్లేని షెడ్లపై అధికారుల కొరడా! హయత్‌నగర్‌లో రెండు భారీ షెడ్లు సీజ్‌
- రంగారెడ్డి

అనుమతుల్లేని షెడ్లపై అధికారుల కొరడా! హయత్‌నగర్‌లో రెండు భారీ షెడ్లు సీజ్‌

అనుమతుల్లేని షెడ్లపై అధికారుల కొరడా! హయత్‌నగర్‌లో రెండు భారీ షెడ్లు సీజ్‌ సాయిబాబా గుడి వెనుక, వనస్థలిపురం రోడ్డులో చర్యలు హయత్‌నగర్‌, సెప్టెంబర్‌ 10 (పున్నమి న్యూస్‌): ఎల్బీనగర్‌ సర్కిల్‌ పరిధిలో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న భారీ షెడ్లపై అధికారులు చర్యలు చేపట్టారు. హయత్‌నగర్‌ సాయిబాబా గుడి వెనుక వైపు నిర్మిస్తున్న భారీ షెడ్‌తో పాటు వనస్థలిపురం రోడ్డులోని మరో షెడ్డును గురువారం సీజ్‌ చేసినట్లు అధికారులు తెలిపారు. సాయిబాబా గుడి వెనుక వైపు రేకులు, ఇనుప సామగ్రితో భారీ షెడ్‌ నిర్మాణం చేపట్టినట్లు స్థానికుల నుంచి ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో అధికారులు పరిశీలించారు. నిర్మాణానికి సంబంధిత అనుమతులు లేనట్లు గుర్తించడంతో షెడ్డును సీజ్‌ చేసినట్లు తెలిపారు. నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్న సమయంలో అధికారులు చర్యలు తీసుకోవడం గమనార్హం. ఈ విషయంపై ఏసీపీ విజయలక్ష్మి, పట్టణ ప్రణాళిక అధికారి సోమేశ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో అధికారులు చర్యలు చేపట్టినట్లు సమాచారం. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే నిబంధనల ప్రకారం చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేసినట్లు పున్నమి న్యూస్‌కు స్పందించారు. అధికారుల చర్యతో అక్రమ నిర్మాణాలపై పర్యవేక్షణ మరింత కట్టుదిట్టం చేయాలనే డిమాండ్‌ స్థానికుల నుంచి వినిపిస్తోంది.

అనుమతుల్లేని షెడ్లపై అధికారుల కొరడా!
హయత్‌నగర్‌లో రెండు భారీ షెడ్లు సీజ్‌

సాయిబాబా గుడి వెనుక, వనస్థలిపురం రోడ్డులో చర్యలు

హయత్‌నగర్‌, సెప్టెంబర్‌ 10 (పున్నమి న్యూస్‌): ఎల్బీనగర్‌ సర్కిల్‌ పరిధిలో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న భారీ షెడ్లపై అధికారులు చర్యలు చేపట్టారు. హయత్‌నగర్‌ సాయిబాబా గుడి వెనుక వైపు నిర్మిస్తున్న భారీ షెడ్‌తో పాటు వనస్థలిపురం రోడ్డులోని మరో షెడ్డును గురువారం సీజ్‌ చేసినట్లు అధికారులు తెలిపారు.
సాయిబాబా గుడి వెనుక వైపు రేకులు, ఇనుప సామగ్రితో భారీ షెడ్‌ నిర్మాణం చేపట్టినట్లు స్థానికుల నుంచి ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో అధికారులు పరిశీలించారు. నిర్మాణానికి సంబంధిత అనుమతులు లేనట్లు గుర్తించడంతో షెడ్డును సీజ్‌ చేసినట్లు తెలిపారు. నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్న సమయంలో అధికారులు చర్యలు తీసుకోవడం గమనార్హం.
ఈ విషయంపై ఏసీపీ విజయలక్ష్మి, పట్టణ ప్రణాళిక అధికారి సోమేశ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో అధికారులు చర్యలు చేపట్టినట్లు సమాచారం. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే నిబంధనల ప్రకారం చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేసినట్లు పున్నమి న్యూస్‌కు స్పందించారు.
అధికారుల చర్యతో అక్రమ నిర్మాణాలపై పర్యవేక్షణ మరింత కట్టుదిట్టం చేయాలనే డిమాండ్‌ స్థానికుల నుంచి వినిపిస్తోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.