Monday, 21 September 2026
  • Home  
  • అనుమతులు లేకుండా ఫంక్షన్ హాల్ నిర్మాణం.. చర్యలు ఎప్పుడూ?
- రంగారెడ్డి

అనుమతులు లేకుండా ఫంక్షన్ హాల్ నిర్మాణం.. చర్యలు ఎప్పుడూ?

అనుమతులు లేకుండా ఫంక్షన్ హాల్ నిర్మాణం.. చర్యలు ఎప్పుడూ? గ్రామపంచాయతీ ఆదాయానికి గండి.. నిబంధనలు బేఖాతర్! ఇబ్రహీంపట్నం, ఆగస్టు 31: ఇబ్రహీంపట్నం మండలం కల్సా ఉప్పరిగూడ గ్రామ రెవెన్యూ పరిధిలోని పోచారం CVR కళాశాల సమీపంలో అనుమతులు లేకుండా ఫంక్షన్ హాల్ నిర్మించి వ్యాపారం నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వెలువెత్తాయి. రీవేరా (Rivera) ఫంక్షన్ హాల్ ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్మించారని, దీనివల్ల గ్రామపంచాయతీకి రావాల్సిన ఆదాయానికి గండి పడుతోందని గ్రామపంచాయతీ వార్డు సభ్యులు ప్రజావాణి అధికారికి ఫిర్యాదు చేశారు. ఫంక్షన్ హాల్ నిర్మాణం, నిర్వహణపై గ్రామపంచాయతీ కార్యదర్శికి పలుమార్లు సమాచారం ఇచ్చినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని వార్డు సభ్యులు ఆరోపించారు. ప్రభుత్వ నిబంధనలను పట్టించుకోకుండా నిర్మాణం చేపట్టి వ్యాపారం కొనసాగిస్తున్నారని, దీనిపై అధికారులు సమగ్రంగా విచారణ చేపట్టి అనుమతులు ఉన్నాయా? నిబంధనలు పాటిస్తున్నారా? అనే అంశాలను పరిశీలించాలని కోరారు. గ్రామపంచాయతీ ఆదాయానికి నష్టం కలుగుతున్న నేపథ్యంలో సంబంధిత ఫంక్షన్ హాల్‌పై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రజావాణి అధికారి ఇబ్రహీంపట్నంకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ వార్డు సభ్యులు నర్కుడి మహేందర్, కొంగరి రవితేజ తదితరులు పాల్గొన్నారు.

అనుమతులు లేకుండా ఫంక్షన్ హాల్ నిర్మాణం.. చర్యలు ఎప్పుడూ?

గ్రామపంచాయతీ ఆదాయానికి గండి.. నిబంధనలు బేఖాతర్!

ఇబ్రహీంపట్నం, ఆగస్టు 31:
ఇబ్రహీంపట్నం మండలం కల్సా ఉప్పరిగూడ గ్రామ రెవెన్యూ పరిధిలోని పోచారం CVR కళాశాల సమీపంలో అనుమతులు లేకుండా ఫంక్షన్ హాల్ నిర్మించి వ్యాపారం నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వెలువెత్తాయి. రీవేరా (Rivera) ఫంక్షన్ హాల్ ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్మించారని, దీనివల్ల గ్రామపంచాయతీకి రావాల్సిన ఆదాయానికి గండి పడుతోందని గ్రామపంచాయతీ వార్డు సభ్యులు ప్రజావాణి అధికారికి ఫిర్యాదు చేశారు.

ఫంక్షన్ హాల్ నిర్మాణం, నిర్వహణపై గ్రామపంచాయతీ కార్యదర్శికి పలుమార్లు సమాచారం ఇచ్చినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని వార్డు సభ్యులు ఆరోపించారు. ప్రభుత్వ నిబంధనలను పట్టించుకోకుండా నిర్మాణం చేపట్టి వ్యాపారం కొనసాగిస్తున్నారని, దీనిపై అధికారులు సమగ్రంగా విచారణ చేపట్టి అనుమతులు ఉన్నాయా? నిబంధనలు పాటిస్తున్నారా? అనే అంశాలను పరిశీలించాలని కోరారు.

గ్రామపంచాయతీ ఆదాయానికి నష్టం కలుగుతున్న నేపథ్యంలో సంబంధిత ఫంక్షన్ హాల్‌పై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రజావాణి అధికారి ఇబ్రహీంపట్నంకు వినతిపత్రం సమర్పించారు.

ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ వార్డు సభ్యులు నర్కుడి మహేందర్, కొంగరి రవితేజ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.