అనుకున్నట్లే కావలి సిద్దం…సక్సస్సే..
అసంతృప్తి కి..తెర పడేనా…
గత హామీల పై …ప్రకటన ..నో…
జయప్రతాప్ రెడ్డి, నెల్లూరు బ్యూరో ( ఏప్రిల్ పున్నమి)
వైసీపీ అభిమానులు ఊహించినట్లుగానే శనివారం సాయంత్రం కావలిలో సిద్ధం సభ కార్యకర్తల సందడితో సక్సెస్ అయ్యింది. కావలి ఎమ్మెల్యే పేర్కొనట్లుగా లక్షన్నర జనాభా తరలివస్తారని చెప్పినా అంతకుమించి జన సందోహం కనపడటం విశేషమే. అంతేకాకుండా వచ్చిన జనంలో కూడా జగన్ ప్రసంగించినంతసేపు భారీగానే స్పందన లభించడం కూడా పార్టీ నేతలను ఆనందానికి గురిచేసింది. సరిగ్గా వారం క్రితం తెలుగుదేశం అధినేత చంద్రబాబు నిర్వహించిన ప్రజాగళంకు అంతగా స్పందన లేదని దీనికి సవాల్ గా జగన్ సభ ఉంటుందని పలు ప్రచారాల యుద్ధం మొదలైనా అది పూర్తిగా కావలి నియోజకవర్గం సభ కావడం, జగన్ సభ ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన సమీకరణ కావడంతో రెండిటికీ పోల్చేందుకు ఎలాంటి అవకాశం లేదు. అయితే జగన్ సభకు విచ్చేసిన వారు ఆయన ప్రసంగాలకి ప్రతిస్పందించడం చంద్రబాబు సభలో అది అంతగా కానురాకపోవడం ప్రధాన తేడా.
కానీ జగన్ ఏడాది క్రితం కావలిలో నిర్వహించిన సభలో కావలికి సంబంధించి పలు సుదీర్ఘ సమస్యల పరిష్కారానికి హామీ ఇస్తూ చేసిన ప్రకటనల ఫలితం ఏది లేకపోవడం కావలి వాసులను చర్చకు గురిచేసింది. కావలి ప్రాంతానికి సంబంధించిన పలు సమస్యలకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సభ తర్వాత పార్టీ నేతలు ఆనందం వ్యక్తం చేస్తూ ప్రకటనలు గుప్పించారు .అయితే ఆ ఫలితాలు ఏవి కనపడకపోవడంతో వాటి గురించి ప్రస్తావన వస్తుందని పలువురు రు ఆశించారు కానీ జగన్ రాష్ట్ర స్థాయిలో ప్రసంగాన్ని కొనసాగిస్తూ అభ్యర్థులను పరిచయం చేస్తూ మరల విజయం కలిగించాలని చంద్రబాబుపై భారీ విమర్శలను గుప్పించి పార్టీ కార్యకర్తలను ఉత్సాహపరిచారు. నెల్లూరు పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల శాసన సభ్యులను పరిచయం చేయగా ఎంపీ అభ్యర్థి విజయ సాయిలు మాత్రం అత్యంత ముఖ్యుడు , నమ్మకస్తుడు సన్నిహితుడు అని పేర్కొన్నారు. కందుకూరు ఎమ్మెల్యే అభ్యర్థి మధుసూదన్ యాదవ్ పేరు ప్రస్తావిస్తూ ఉన్న
అతి తక్కువ మంచి వారిలో ఒకరని చెప్పిన అనంతరం వేదిక మీద మధు యాదవ్ ఆయనకు పాదాభివందనం చేయడం కనిపించింది. మొత్తం మీద తక్కువ సమయంలో కావలి ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి అనుకున్న విధంగా సభను తీర్చిదిద్దగా ఇతర ప్రాంతాల నియోజకవర్గాల నుంచి భారీగా కార్యకర్తలు అభిమానులు తరలించడంలో ఉదయగిరి నేతలు రాజారెడ్డి ఆయన తనయుడు అభినవరెడ్డి ప్రథమ స్థానం, ఆ తర్వాత కోవూరు నియోజకవర్గం నుండి కందుకూరు నుండి కూడా భారీగా కార్యకర్తలు తరలి రావడం కనిపించింది. కావలి గ్రామీణ ప్రాంతాల నుండి అదేవిధంగా కార్యకర్తలను తరలించడంలో ప్రతాప్ రెడ్డి సఫలం అయ్యారు.
జగన్ సిద్ధం సభ ఎన్నికల్లో వైసిపి పై ఉన్న అసంతృప్తి ని ఏ మేరకు భర్తీ చేస్తుందనే ది తేలాల్సి ఉంది..
ఎందుకంటే తరలింపు లో అన్ని పార్టీల మాదిరిగా… తాయిలాలు… తాంబూలాలు ఉండడమె కారణం.
అనుకున్నట్లే కావలి సిద్దం…సక్సస్సే.. అసంతృప్తి కి..తెర పడేనా… గత హామీల పై …ప్రకటన ..నో..
అనుకున్నట్లే కావలి సిద్దం…సక్సస్సే.. అసంతృప్తి కి..తెర పడేనా… గత హామీల పై …ప్రకటన ..నో… జయప్రతాప్ రెడ్డి, నెల్లూరు బ్యూరో ( ఏప్రిల్ పున్నమి) వైసీపీ అభిమానులు ఊహించినట్లుగానే శనివారం సాయంత్రం కావలిలో సిద్ధం సభ కార్యకర్తల సందడితో సక్సెస్ అయ్యింది. కావలి ఎమ్మెల్యే పేర్కొనట్లుగా లక్షన్నర జనాభా తరలివస్తారని చెప్పినా అంతకుమించి జన సందోహం కనపడటం విశేషమే. అంతేకాకుండా వచ్చిన జనంలో కూడా జగన్ ప్రసంగించినంతసేపు భారీగానే స్పందన లభించడం కూడా పార్టీ నేతలను ఆనందానికి గురిచేసింది. సరిగ్గా వారం క్రితం తెలుగుదేశం అధినేత చంద్రబాబు నిర్వహించిన ప్రజాగళంకు అంతగా స్పందన లేదని దీనికి సవాల్ గా జగన్ సభ ఉంటుందని పలు ప్రచారాల యుద్ధం మొదలైనా అది పూర్తిగా కావలి నియోజకవర్గం సభ కావడం, జగన్ సభ ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన సమీకరణ కావడంతో రెండిటికీ పోల్చేందుకు ఎలాంటి అవకాశం లేదు. అయితే జగన్ సభకు విచ్చేసిన వారు ఆయన ప్రసంగాలకి ప్రతిస్పందించడం చంద్రబాబు సభలో అది అంతగా కానురాకపోవడం ప్రధాన తేడా. కానీ జగన్ ఏడాది క్రితం కావలిలో నిర్వహించిన సభలో కావలికి సంబంధించి పలు సుదీర్ఘ సమస్యల పరిష్కారానికి హామీ ఇస్తూ చేసిన ప్రకటనల ఫలితం ఏది లేకపోవడం కావలి వాసులను చర్చకు గురిచేసింది. కావలి ప్రాంతానికి సంబంధించిన పలు సమస్యలకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సభ తర్వాత పార్టీ నేతలు ఆనందం వ్యక్తం చేస్తూ ప్రకటనలు గుప్పించారు .అయితే ఆ ఫలితాలు ఏవి కనపడకపోవడంతో వాటి గురించి ప్రస్తావన వస్తుందని పలువురు రు ఆశించారు కానీ జగన్ రాష్ట్ర స్థాయిలో ప్రసంగాన్ని కొనసాగిస్తూ అభ్యర్థులను పరిచయం చేస్తూ మరల విజయం కలిగించాలని చంద్రబాబుపై భారీ విమర్శలను గుప్పించి పార్టీ కార్యకర్తలను ఉత్సాహపరిచారు. నెల్లూరు పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల శాసన సభ్యులను పరిచయం చేయగా ఎంపీ అభ్యర్థి విజయ సాయిలు మాత్రం అత్యంత ముఖ్యుడు , నమ్మకస్తుడు సన్నిహితుడు అని పేర్కొన్నారు. కందుకూరు ఎమ్మెల్యే అభ్యర్థి మధుసూదన్ యాదవ్ పేరు ప్రస్తావిస్తూ ఉన్న అతి తక్కువ మంచి వారిలో ఒకరని చెప్పిన అనంతరం వేదిక మీద మధు యాదవ్ ఆయనకు పాదాభివందనం చేయడం కనిపించింది. మొత్తం మీద తక్కువ సమయంలో కావలి ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి అనుకున్న విధంగా సభను తీర్చిదిద్దగా ఇతర ప్రాంతాల నియోజకవర్గాల నుంచి భారీగా కార్యకర్తలు అభిమానులు తరలించడంలో ఉదయగిరి నేతలు రాజారెడ్డి ఆయన తనయుడు అభినవరెడ్డి ప్రథమ స్థానం, ఆ తర్వాత కోవూరు నియోజకవర్గం నుండి కందుకూరు నుండి కూడా భారీగా కార్యకర్తలు తరలి రావడం కనిపించింది. కావలి గ్రామీణ ప్రాంతాల నుండి అదేవిధంగా కార్యకర్తలను తరలించడంలో ప్రతాప్ రెడ్డి సఫలం అయ్యారు. జగన్ సిద్ధం సభ ఎన్నికల్లో వైసిపి పై ఉన్న అసంతృప్తి ని ఏ మేరకు భర్తీ చేస్తుందనే ది తేలాల్సి ఉంది.. ఎందుకంటే తరలింపు లో అన్ని పార్టీల మాదిరిగా… తాయిలాలు… తాంబూలాలు ఉండడమె కారణం.