వార్త ముఖ్యాంశాలు
- విశాఖపట్నం: ప్రముఖ రిటైల్ వ్యాపారవేత్త, చందన బ్రదర్స్ మరియు సీఎంఆర్ షాపింగ్ మాల్స్ వ్యవస్థాపకుడు చందన మోహన్ రావు (82) ఇకలేరు.
- కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ ఉదయం విశాఖలో తుదిశ్వాస విడిచారు.
- 1971లో సరసమైన ధరలకు నాణ్యమైన వస్త్రాలు, ఫర్నీచర్, జువెలరీ అందించే లక్ష్యంతో చందన బ్రదర్స్ సంస్థను ప్రారంభించి, తన దూరదృష్టి, కృషితో తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ రిటైల్ సంస్థగా నిలిపారు.
విశాఖపట్నం: ప్రముఖ రిటైల్ వ్యాపారవేత్త, చందన బ్రదర్స్ మరియు సీఎంఆర్ షాపింగ్ మాల్స్ వ్యవస్థాపకుడు చందన మోహన్ రావు (82) ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ ఉదయం విశాఖలో తుదిశ్వాస విడిచారు.
1971లో సరసమైన ధరలకు నాణ్యమైన వస్త్రాలు, ఫర్నీచర్, జువెలరీ అందించే లక్ష్యంతో చందన బ్రదర్స్ సంస్థను ప్రారంభించి, తన దూరదృష్టి, కృషితో తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ రిటైల్ సంస్థగా నిలిపారు. ఆయన మరణం వ్యాపార రంగానికి తీరని లోటు.