Saturday, 17 January 2026

(పున్నమి మంచిమాట) ఈ సంసారం యందు పాంచ భౌతిక స్వరూపముతో జీవుడు అన్నీ తానే అని భ్రమించి చరించున్నాడు. ఈ విశ్వము అనంతము. ఈ విశ్వము నందు అగణిత దివ్య వసంతములు ఎన్నో కాలగర్భమున ఇమిడి పోయినవి. మరెన్నో వసంతములు సిద్దముగా యున్నవి. ఈ పక్రియ అనంతం దీనికి అంతము లేదు. ఇది నిరంతం కొనసాగే పక్రియ. సముద్రము ఒడ్డున యుండే సైకత రేణువులు అనంతం. వాటిని లెక్కపెట్టుట ఎవరి వల్ల గాదు. అలాగే ఈ ప్రకృతి యందు విరాట్‌ ‌పురుషుని రూపము అనంతం. ఆయన చేతలు అనంతం. లీలలు మనోహరం. ఈ జగత్తునందు హిరణ్య గర్భునిచే స్పృశించబడిన వేద వ్యాస ప్రామాణికములు అయిన వేద ములు అనంతం. అనంతమయిన ఈ వేద ములు పూర్తిగా అభ్యసించిన వారు ఇప్పటికి లేరు. ఈ చరాచర సృష్టిలో చిదానంద స్వరూ పుని రూపములు అనంతం. ఎవరి అభీష్టం ప్రకారం వారు చిదానంద స్వరూపుని కొలుచు చున్నారు. ఆయన రూపం ఇది ఆయన లీలలు సంపూర్తిగా ఇవి అని పసిగట్ట గల నేర్పరి ఇప్పటికి లభ్యమగుట లేదు. ఈ అనంత విశ్వ మందు చిన్న ప్రాణి అయిన మానవుడు ‘అంతా నేనే’ అని భ్రమపడుట ఎంత విచిత్రం. ఈ అనంత విశ్వం నశ్వరం కాకపోవచ్చు. చతుర్ము ఖునిచే సృజియింపబడి ఈ ప్రకృతిలో ఇమిడి యుండే అంశములన్ని ఏదో ఒక నాటికి నాశన మైపోయేవి.ఈ అంశమునందు మానవుడు దృష్టి నిలిపి అశాశ్వతమయిన సుఖముల కంటే అనంతమైన ఖ్యాతి నందించే అంశములపై దృష్టి నిలుప గలగాలి. మనిషి జీవితం చిన్నదే కాని ఆ చిన్న జీవితంలో అనంతమయన ఖ్యాతి నిచ్చే అంశములపై దృష్టి నిలపాలి. సమాజమునకు ఏవి అయితే అవసరమో వాటి పై దృష్టి నిలపాలి. జగద్గురు శంకరాచార్యులు, శ్రీ సాయినాధులు, రమణ మహర్షి, రామకృష్ణ పరమహంన, వివేకానందుల వంటి వారిని ఆదర్శంగా యుంచుకొని జీవితం గడప గలగాలి. ఈ అనంత విశ్వము నందు మానవుని పాత్ర చాలా పరిమితమయనది. తన సహజ మైన మర్కటబుద్దితో జీవిత పరమావధిని మానవుడు మరచుచున్నాడు. శ్రీనివాస చరణార-విందము పై మనసు లగ్నము చేయక తన తోటి ప్రాణులతో అకారణ వైరము సృష్టించుకుంటు, పాపము ప్రాప్తించుకుంటు, నానా క్లేశములందు చిక్కుకుని తాను అనుభ వించుచున్న ఈ సూక్ష్మమయిన జీవితము శాశ్వతము అని భావిస్తూ ఆశ పాశములందు చిక్కుకొని స్వప్నజగత్తునందు పరిభ్రమించు చున్నాడు. అనంతుని మరచి జీవితం అనంతం ఈ ఊహలలో విహరించుచున్నాడు. జీవిత మంటే చిల్లుపడిన నావపై ప్రయాణమని గ్రహించ గలగాలి. జీవితం నీటి బుడగ అని గ్రహించగలగాలి. అనంతుని పొందుటకు అహర్నిశం ఆరాటపడాలి. సహజంగా మాన వుని రజోగుణం తయోగుణం అంటి పెట్టు కుని యుంటాయి. ఈ గుణములు వెను వెం టనే వీడి జ్ఞాన తీర్ధ గ్రహణం చేయగలగాలి. సత్వ గుణము వంట బట్టించు కోవాలి. జీవన సమరము నందు అనేక మయన సంక్లిష్టత లు ఏర్పడుతాయి. వాటినే స్మరించుకుంటూ దిగులు పడరాదు. ఒక మహోన్నత కార్యసిద్దికి లక్ష్యమేర్పచుకొని, ప్రణాళిక సిద్దం చేసుకొని అనంతమయిన మూర్తిమత్వమును ఏర్పరుచుకొని జీవనయోగం గడపగలిగిన వాడే ఇలలో సిసలయిన నేర్పరి. అటువంటి వారిని ఆదర్శంగా తీసుకొని సామాన్యుడు కాలం గడపాలి. ఎందుకంటే వారిని అనుసరిస్తే ఎటువంటి సంకటమయినా, క్లేశమయినా సులభంగా దాటవచ్చు. మృత్యువు అనేది నీడవలె, ఇంకా కఠినంగా చెప్పాలి అంటే బెబ్బులి పంజావలె వెన్నంటే యుంటుంది. జనన మరణాలు అతి సహజం. ఈ ప్రకృతిలో ప్రతి ఒకడు నా ఆత్మజుడు అనే అనంత గుణమును మన మనసులో పెంచుకోవాలి. ‘అందరూ నా ఆత్మజులే అనే భావన’ సర్వకాల సర్వావస్ధల యందు మనసు స్వార్థ్దము, ఈర్ష ్య ద్వేషములకు ఆతీతంగా యుంచుతుంది. కర్మేంద్రియ పంచకమును అదుపులో యుంచుకొని ప్రతి క్షణము అనంత నారాయణుని యందు అనంత నారాయణునిపై మనోలగ్నము గావించినవాడే జీవన పోరాటమునందు ధీశాలి. ఏ రోజుకయినా అంతమయ్యే జీవి అనంతుని యందు ఆశ పెంచుకొని ఆయన కోసం ఆరాట పడగలగాలి. శాశ్వతంగా పేరుతెచ్చే కర్మలపై మనసు లగ్నం చేసి అనంతమయిన కీర్తిని పొందాలి.ఆత్మ శాశ్వతం కాని పరమాత్మ అనంతం అనే అంశం పట్ల జాగరూకత వహించాలి.ఈ ప్రపంచంలో అనన్యమయినది అనంతమయినది మోక్ష ప్రాప్తి. సాధువులకు గాని ముక్షువులకు గాని అనంత లోక ప్రాప్తి అనేది ఘృత సహిత క్షీరాన్నం వంటిదని గ్రహించాలి. వారి మార్గములో మనము నడచి, జీవన అంత్యదశలో అనంతుని సాన్నిహిత్యం సాధించుటకంటే అత్యున్నత దశ వేరొకటి లేదని మనం గ్రహించాలి. టి.వి.శ్రీధర్‌ ‌గూడూరు.

(పున్నమి మంచిమాట)
ఈ సంసారం యందు పాంచ భౌతిక స్వరూపముతో జీవుడు అన్నీ తానే అని భ్రమించి చరించున్నాడు. ఈ విశ్వము అనంతము. ఈ విశ్వము నందు అగణిత దివ్య వసంతములు ఎన్నో కాలగర్భమున ఇమిడి పోయినవి. మరెన్నో వసంతములు సిద్దముగా యున్నవి. ఈ పక్రియ అనంతం దీనికి అంతము లేదు. ఇది నిరంతం కొనసాగే పక్రియ. సముద్రము ఒడ్డున యుండే సైకత రేణువులు అనంతం. వాటిని లెక్కపెట్టుట ఎవరి వల్ల గాదు. అలాగే ఈ ప్రకృతి యందు విరాట్‌ ‌పురుషుని రూపము అనంతం. ఆయన చేతలు అనంతం. లీలలు మనోహరం. ఈ జగత్తునందు హిరణ్య గర్భునిచే స్పృశించబడిన వేద వ్యాస ప్రామాణికములు అయిన వేద ములు అనంతం. అనంతమయిన ఈ వేద ములు పూర్తిగా అభ్యసించిన వారు ఇప్పటికి లేరు. ఈ చరాచర సృష్టిలో చిదానంద స్వరూ పుని రూపములు అనంతం. ఎవరి అభీష్టం ప్రకారం వారు చిదానంద స్వరూపుని కొలుచు చున్నారు. ఆయన రూపం ఇది ఆయన లీలలు సంపూర్తిగా ఇవి అని పసిగట్ట గల నేర్పరి ఇప్పటికి లభ్యమగుట లేదు. ఈ అనంత విశ్వ మందు చిన్న ప్రాణి అయిన మానవుడు ‘అంతా నేనే’ అని భ్రమపడుట ఎంత విచిత్రం. ఈ అనంత విశ్వం నశ్వరం కాకపోవచ్చు. చతుర్ము ఖునిచే సృజియింపబడి ఈ ప్రకృతిలో ఇమిడి యుండే అంశములన్ని ఏదో ఒక నాటికి నాశన మైపోయేవి.ఈ అంశమునందు మానవుడు దృష్టి నిలిపి అశాశ్వతమయిన సుఖముల కంటే అనంతమైన ఖ్యాతి నందించే అంశములపై దృష్టి నిలుప గలగాలి. మనిషి జీవితం చిన్నదే కాని ఆ చిన్న జీవితంలో అనంతమయన ఖ్యాతి నిచ్చే అంశములపై దృష్టి నిలపాలి. సమాజమునకు ఏవి అయితే అవసరమో వాటి పై దృష్టి నిలపాలి. జగద్గురు శంకరాచార్యులు, శ్రీ సాయినాధులు, రమణ మహర్షి, రామకృష్ణ పరమహంన, వివేకానందుల వంటి వారిని ఆదర్శంగా యుంచుకొని జీవితం గడప గలగాలి.
ఈ అనంత విశ్వము నందు మానవుని పాత్ర చాలా పరిమితమయనది. తన సహజ మైన మర్కటబుద్దితో జీవిత పరమావధిని మానవుడు మరచుచున్నాడు. శ్రీనివాస చరణార-విందము పై మనసు లగ్నము చేయక తన తోటి ప్రాణులతో అకారణ వైరము సృష్టించుకుంటు, పాపము ప్రాప్తించుకుంటు, నానా క్లేశములందు చిక్కుకుని తాను అనుభ వించుచున్న ఈ సూక్ష్మమయిన జీవితము శాశ్వతము అని భావిస్తూ ఆశ పాశములందు చిక్కుకొని స్వప్నజగత్తునందు పరిభ్రమించు చున్నాడు. అనంతుని మరచి జీవితం అనంతం ఈ ఊహలలో విహరించుచున్నాడు. జీవిత మంటే చిల్లుపడిన నావపై ప్రయాణమని గ్రహించ గలగాలి. జీవితం నీటి బుడగ అని గ్రహించగలగాలి. అనంతుని పొందుటకు అహర్నిశం ఆరాటపడాలి. సహజంగా మాన వుని రజోగుణం తయోగుణం అంటి పెట్టు కుని యుంటాయి. ఈ గుణములు వెను వెం టనే వీడి జ్ఞాన తీర్ధ గ్రహణం చేయగలగాలి. సత్వ గుణము వంట బట్టించు కోవాలి. జీవన సమరము నందు అనేక మయన సంక్లిష్టత లు ఏర్పడుతాయి. వాటినే స్మరించుకుంటూ దిగులు పడరాదు. ఒక మహోన్నత కార్యసిద్దికి లక్ష్యమేర్పచుకొని, ప్రణాళిక సిద్దం చేసుకొని అనంతమయిన మూర్తిమత్వమును ఏర్పరుచుకొని జీవనయోగం గడపగలిగిన వాడే ఇలలో సిసలయిన నేర్పరి. అటువంటి వారిని ఆదర్శంగా తీసుకొని సామాన్యుడు కాలం గడపాలి. ఎందుకంటే వారిని అనుసరిస్తే ఎటువంటి సంకటమయినా, క్లేశమయినా సులభంగా దాటవచ్చు. మృత్యువు అనేది నీడవలె, ఇంకా కఠినంగా చెప్పాలి అంటే బెబ్బులి పంజావలె వెన్నంటే యుంటుంది. జనన మరణాలు అతి సహజం. ఈ ప్రకృతిలో ప్రతి ఒకడు నా ఆత్మజుడు అనే అనంత గుణమును మన మనసులో పెంచుకోవాలి.
‘అందరూ నా ఆత్మజులే అనే భావన’ సర్వకాల సర్వావస్ధల యందు మనసు స్వార్థ్దము, ఈర్ష ్య ద్వేషములకు ఆతీతంగా యుంచుతుంది.
కర్మేంద్రియ పంచకమును అదుపులో యుంచుకొని ప్రతి క్షణము అనంత నారాయణుని యందు అనంత నారాయణునిపై మనోలగ్నము గావించినవాడే జీవన పోరాటమునందు ధీశాలి. ఏ రోజుకయినా అంతమయ్యే జీవి అనంతుని యందు ఆశ పెంచుకొని ఆయన కోసం ఆరాట పడగలగాలి. శాశ్వతంగా పేరుతెచ్చే కర్మలపై మనసు లగ్నం చేసి అనంతమయిన కీర్తిని పొందాలి.ఆత్మ శాశ్వతం కాని పరమాత్మ అనంతం అనే అంశం పట్ల జాగరూకత వహించాలి.ఈ ప్రపంచంలో అనన్యమయినది అనంతమయినది మోక్ష ప్రాప్తి. సాధువులకు గాని ముక్షువులకు గాని అనంత లోక ప్రాప్తి అనేది ఘృత సహిత క్షీరాన్నం వంటిదని గ్రహించాలి. వారి మార్గములో మనము నడచి, జీవన అంత్యదశలో అనంతుని సాన్నిహిత్యం సాధించుటకంటే అత్యున్నత దశ వేరొకటి లేదని మనం గ్రహించాలి.

టి.వి.శ్రీధర్‌
‌గూడూరు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.