Friday, 15 May 2026
  • Home  
  • ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం – వింజమూరులో వినతులు స్వీకరించిన టీడీపీ నాయకత్వం
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం – వింజమూరులో వినతులు స్వీకరించిన టీడీపీ నాయకత్వం

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం – వింజమూరులో వినతులు స్వీకరించిన టీడీపీ నాయకత్వం వింజమూరు మండలం బొమ్మరాజుచెరువు గ్రామంలోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామాల నుంచి వచ్చిన ప్రజల వినతులు, అర్జీలను స్వయంగా స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను ఓర్పుతో విని, వాటి పరిష్కారానికి సంబంధిత శాఖ అధికారులతో వెంటనే సమన్వయం చేసుకొని చర్చించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా పెన్షన్లు, రేషన్, తాగునీరు, రహదారులు, విద్యుత్, ఆదాయ ధృవపత్రాలు వంటి పలు సమస్యలపై వచ్చిన అర్జీలను పరిశీలించి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రజల సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రతి అర్జీపై ప్రత్యేక దృష్టి సారించి బాధితులకు న్యాయం జరిగేలా కట్టుబడి పనిచేస్తానని భరోసా కల్పించారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం – వింజమూరులో వినతులు స్వీకరించిన టీడీపీ నాయకత్వం
వింజమూరు మండలం బొమ్మరాజుచెరువు గ్రామంలోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామాల నుంచి వచ్చిన ప్రజల వినతులు, అర్జీలను స్వయంగా స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను ఓర్పుతో విని, వాటి పరిష్కారానికి సంబంధిత శాఖ అధికారులతో వెంటనే సమన్వయం చేసుకొని చర్చించారు.
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా పెన్షన్లు, రేషన్, తాగునీరు, రహదారులు, విద్యుత్, ఆదాయ ధృవపత్రాలు వంటి పలు సమస్యలపై వచ్చిన అర్జీలను పరిశీలించి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రజల సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రతి అర్జీపై ప్రత్యేక దృష్టి సారించి బాధితులకు న్యాయం జరిగేలా కట్టుబడి పనిచేస్తానని భరోసా కల్పించారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానన్నారు.
కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.