(అమరావతి పున్నమి అసోసియేటు ఎడిటర్ సూరం మల్లికార్జున శర్మ)
2024 ఎన్నికలకు ముందు మన రాష్ట్రం తిరుగులేనిదిగా అభివృద్ధి చేస్తామని అభూత కల్పనలు కల్పించగల్గడం కూటమి ప్రభుత్వం సఫలీకృతుమైంది. ఎప్పుడూ, ఎవ్వరూ ఊహించని రీతిలో కూటమిని గెలిపించుకున్నారు. హామీల వెల్లువ కురిపించారు, ప్రజలు హామీల కంటే ప్రభుత్వ యంత్రాంగం యొక్క పని తీరులో మార్పును కోరుకున్నారు. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం గత ప్రభుత్వపు వైఫల్యాలు వెల్లడిరచడంలో కాలయాపన చేస్తూనే వున్నారు తప్పితే వారి మార్కు పాలన చూపడం లేదనే చెప్పాలి.
జూన్‌లో మొన్ననే ప్రమాణ స్వీకారం చేశామన్నారు, జూలైలో ఇంకా రెండు నెలలు కూడా కాలేదన్నారు తరువాత ఖజనా ఖాళీగా వుందన్నారు, ఆ తరువాత ఒక్కొక్కటిగా గాడిన పెడుతున్నాము అని పది నెలలు గడిపారు తీరా ఇప్పుడు ప్రశ్నిస్తే అప్పుడే కొంపలేమీ మునిగి పోయాయి ఇంకా నాలుగేళ్లు వున్నాయంటున్నారు. మోడీకి తన పార్టీకి ఒక ఎమ్మెల్సీ సీటు కొరకు పెట్టిన శ్రద్ధలో వందో వంతు ఆంధ్రా అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నాడా ఆయనే ఆత్మావలోకనం చేసుకోవాలి. గతంలో చంద్రబాబు వ్యవహరించిన తీరు ఆయన పూర్తి స్థాయిలో నమ్మలేకున్నాడు. రాబోయే ఎన్నికల్లో కూడా ఇంచు మించు ఇద్దరు వయస్సు పై బడ్డ నాయకులుగా మిగలనున్నారు. మోడీకి తన తరువాత ఏమిటి అని ప్రశ్నార్థకంగా వుంటే, చంద్రబాబు మాత్రం లోకేష్ తన వారసుడుగా నిలబెట్టుకోవడంలో సఫలీకృతుడౌతున్నాడు.
ఇక చంద్రబాబు తాను 95 నాటి సిఎం నని పదే పదే ముసలి చాదస్తపు మాటలు తప్పితే తాను గ్రహణం పట్టిన చంద్రుడు వలె వ్యవహరిస్తున్నాడు, ఇక ఏమన్నా ప్రశ్నిస్తాడేమో అని జగన్ వైపు చూస్తే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ఆ పై నన్ను మాజీ ముఖ్యమంత్రి స్థాయి గుర్తింపు ఇవ్వండి అని మారం చేస్తున్నాడు. ఈ వ్యవహారాలు ఇలాగే కొనసాగితే రాబోయే నాలుగేళ్లు ఆంధ్రప్రదేశ్ అధోగతి పాలవడం ఖాయమన్పిస్తూంది. ఇక పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే తనకే రాజకీయ పరిపక్వత రాలేదు, ఆయన అభిమానులు మాత్రం ఏ అంశం మీద అధ్యయనం చేసే దిశలో నిర్ధిష్టంగా ఆలోచించే స్థాయికి చేరుకోగల్గితే ఆ పార్టీకి మనుగడ వుంటుంది.
ఇక సచివాలయంలో ఠాకూర్ సినిమాలో వలె నిత్యం ఫైల్స్, అధికారుల హడావుడి జరుగుతూనే వుంది, తద్వారా ఫలితమేముస్తుందో వేచి చూడాల్సిందే!