31-05-2020మనుబోలు(పున్నమిప్రతినిధి)అకస్మాత్తుగా గోడ కూలి చిన్నారిపై పడడంతో దుర్మరణం
మనుబోలు మండలంలోని పిడురూపాలెం గ్రామంలో గోడ కూలడంతో ఓ చిన్నారి దుర్మరణం చెందిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పిడూరు గ్రామానికి చెందిన కొండా వెంకట రమణమ్మ, రమణయ్య దంపతలకు ముగ్గురు కుమారులు ఉన్నారు.వీరికి మొదట ఒక కుమారుడు పుట్టగా రెండవ కాన్పులో ఇద్దరు మగపిల్లలు కమలలు జన్మిచ్చారు. ఆదివారం ఉదయం టిఫిన్ చేసి తిన్న ప్లేటు ను బయట ఉన్న బాత్రూమ్ వద్దకు తీసుకువెళ్లి పెడుతుండగా అకస్మాత్తుగా గోడ కూలి శ్రీరామ్(5)పై పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అప్పటివరకు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో కలిసి ఉన్న చిన్నారి అనంత లోకాలకు వెళ్లడంతో కన్నీరుమున్నీరుగా విలపించడంతో ఈ ప్రాంతంలో రోదనలు మిన్నంటాయి.ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
అకస్మాత్తుగా గోడ కూలి చిన్నారి దుర్మరణం
31-05-2020మనుబోలు(పున్నమిప్రతినిధి)అకస్మాత్తుగా గోడ కూలి చిన్నారిపై పడడంతో దుర్మరణం మనుబోలు మండలంలోని పిడురూపాలెం గ్రామంలో గోడ కూలడంతో ఓ చిన్నారి దుర్మరణం చెందిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పిడూరు గ్రామానికి చెందిన కొండా వెంకట రమణమ్మ, రమణయ్య దంపతలకు ముగ్గురు కుమారులు ఉన్నారు.వీరికి మొదట ఒక కుమారుడు పుట్టగా రెండవ కాన్పులో ఇద్దరు మగపిల్లలు కమలలు జన్మిచ్చారు. ఆదివారం ఉదయం టిఫిన్ చేసి తిన్న ప్లేటు ను బయట ఉన్న బాత్రూమ్ వద్దకు తీసుకువెళ్లి పెడుతుండగా అకస్మాత్తుగా గోడ కూలి శ్రీరామ్(5)పై పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అప్పటివరకు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో కలిసి ఉన్న చిన్నారి అనంత లోకాలకు వెళ్లడంతో కన్నీరుమున్నీరుగా విలపించడంతో ఈ ప్రాంతంలో రోదనలు మిన్నంటాయి.ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.