భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బిజెపి ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు మందారపు యాదగిరి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బిజెపి జనగామ జిల్లా అధ్యక్షులు సౌడ రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సౌడ రమేష్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకొని ఉన్నతమైన స్థానాలకు చేరుకోవాలని బీసీ ఎస్సీ ఎస్టీ మటుకు బలహీనవర్గాలు అభివృద్ధి అంతిమ లక్ష్మంగా నరేంద్ర మోడీ అంబేద్కర్ ఆశయ సాధన కోసం కృషి చేస్తున్నారని బడుగు బలహీనవర్గాల అభివృద్ధి ధ్యేయంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ పనిచేస్తున్నారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా నాయకులు జనరల్ సెక్రెటరీ మోతి జనార్ధన్ ఉపాధ్యక్షులు గంధం రాములు ట్రెజరర్ అనిల్ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు దుర్గారాజు స్టేట్ కౌన్సిల్ మెంబర్ పెరమాండ్ల వెంకటేశ్వర్లు జిల్లా వైస్ ప్రెసిడెంట్ సృజన్ బిజెపి నాయకులు పాల్గొన్నారు

