రైల్వేకోడూరు: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్సీపీ కోడూరు మండల విస్తృత స్థాయి సమావేశం సోమవారం పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మండలంలోని పార్టీ కార్యకలాపాలు, ఎన్నికల సన్నద్ధత, నాయకులు–కార్యకర్తల సమన్వయంపై చర్చించారు.
సమావేశంలో కొరముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేసిన నాయకులు, కార్యకర్తలకు ఎన్నికల్లో తగిన అవకాశాలు కల్పించే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని సూచించారు. స్థానిక స్థాయిలో నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తే పార్టీ కార్యకలాపాలను మరింత విస్తరించవచ్చన్నారు. గ్రామస్థాయిలో ఎదురవుతున్న సమస్యలు, ఎన్నికల సన్నద్ధతకు సంబంధించి నాయకులు సూచనలు, సలహాలు అందించాలని కోరారు.
కార్యక్రమంలో పంజం వేణుగోపాల్‌రెడ్డి, మాదినేని వెంకట్‌రెడ్డి, సీహెచ్ రమేష్, మండల నాగేంద్ర, అన్వర్భాష, జడ్పీటీసీ రత్నమ్మ, కనుపర్తి ఈశ్వరయ్య, అంబటి మురళి, గునిశెట్టి రమేష్, ముజీబ్, రవిచంద్రరెడ్డి, సుబ్బరామరాజు, దమ్ము రఘు, రాజా (గని), దాడిశెట్టి సిద్దు రాయల్, కొండూరు సుదర్శన్‌రాజు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


