Saturday, 15 August 2026

కందాల చంటి కి గణ సన్మానం చేసిన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పి. గన్నవరం నుండి.పున్నమి ప్రతినిధి. డా.బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా, పి.గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ క్యాంప్ కార్యాలయంలో మెగా యూత్ ఫోర్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కో-కన్వీనర్‌గా ఎంపికైన కందాల చంటి ని ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ తాను చదువుకునే రోజుల్లో మెగాస్టార్ చిరంజీవిని ఎంతో అభిమానించేవాడినని, ఆయన పాటలకు డ్యాన్స్ చేసేవాడినని గుర్తు చేసుకున్నారు. చిరంజీవి ప్రారంభించిన “రక్తదానం చేయండి.. ప్రాణదాతలు కండి” వంటి సేవా కార్యక్రమాల ద్వారా ఆపదలో ఉన్న ఎంతోమందికి ప్రాణదానం జరిగిందని అన్నారు.సహాయం చేయడంలో మెగా ఫ్యామిలీకి ఎవరూ సాటిరారని, ప్రజాసేవలో ఎల్లప్పుడూ ముందుండే తమ ప్రియతమ నాయకులు కొణిదెల పవన్ కళ్యాణ్ కూడా సేవా కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.తన నియోజకవర్గానికి చెందిన కందాల చంటి నిస్వార్థంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, సేవా దృక్పథంతో ముందుకు సాగుతున్నారని ఎమ్మెల్యే అభినందించారు. చంటి ని మెగా యూత్ ఫోర్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కో-కన్వీనర్‌గా నియమించడం తనకు ఎంతో ఆనందంగా ఉందని, ముఖ్యంగా ఈ బాధ్యతకు సంబంధించిన అవార్డును మెగాస్టార్ చిరంజీవి కుమార్తె శ్రీమతి సుస్మిత చేతుల మీదుగా అందుకోవడం మరింత సంతోషకరమని అన్నారు.కందాల చంటి భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి యువతకు ఆదర్శంగా నిలవాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మెగా అభిమానులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జనసైనికులు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

కందాల చంటి కి గణ సన్మానం చేసిన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ

పి. గన్నవరం నుండి.పున్నమి ప్రతినిధి. డా.బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా, పి.గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ క్యాంప్ కార్యాలయంలో మెగా యూత్ ఫోర్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కో-కన్వీనర్‌గా ఎంపికైన కందాల చంటి ని ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ తాను చదువుకునే రోజుల్లో మెగాస్టార్ చిరంజీవిని ఎంతో అభిమానించేవాడినని, ఆయన పాటలకు డ్యాన్స్ చేసేవాడినని గుర్తు చేసుకున్నారు. చిరంజీవి ప్రారంభించిన “రక్తదానం చేయండి.. ప్రాణదాతలు కండి” వంటి సేవా కార్యక్రమాల ద్వారా ఆపదలో ఉన్న ఎంతోమందికి ప్రాణదానం జరిగిందని అన్నారు.సహాయం చేయడంలో మెగా ఫ్యామిలీకి ఎవరూ సాటిరారని, ప్రజాసేవలో ఎల్లప్పుడూ ముందుండే తమ ప్రియతమ నాయకులు కొణిదెల పవన్ కళ్యాణ్ కూడా సేవా కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.తన నియోజకవర్గానికి చెందిన కందాల చంటి నిస్వార్థంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, సేవా దృక్పథంతో ముందుకు సాగుతున్నారని ఎమ్మెల్యే అభినందించారు. చంటి ని మెగా యూత్ ఫోర్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కో-కన్వీనర్‌గా నియమించడం తనకు ఎంతో ఆనందంగా ఉందని, ముఖ్యంగా ఈ బాధ్యతకు సంబంధించిన అవార్డును మెగాస్టార్ చిరంజీవి కుమార్తె శ్రీమతి సుస్మిత చేతుల మీదుగా అందుకోవడం మరింత సంతోషకరమని అన్నారు.కందాల చంటి భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి యువతకు ఆదర్శంగా నిలవాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మెగా అభిమానులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జనసైనికులు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.