Sunday, 10 May 2026
  • Home  
  • స్థంభాద్రి గుట్టలో నిర్లక్ష్యం బట్టబయలు.. E.O ఎక్కడ? భక్తులే భారం మోస్తున్నారా?
- ఖమ్మం

స్థంభాద్రి గుట్టలో నిర్లక్ష్యం బట్టబయలు.. E.O ఎక్కడ? భక్తులే భారం మోస్తున్నారా?

ఖమ్మం /మే 10/ పున్నమి జిల్లా ప్రతి నిధి ఖమ్మం నగరానికి ఆధ్యాత్మిక చిహ్నంగా నిలిచిన పవిత్ర స్తంభాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం నిర్వహణపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోట్లాది రూపాయల ఆదాయం వచ్చే ఈ దేవస్థానంలో ప్రాథమిక పరిపాలనా వ్యవస్థ సైతం సరిగా లేకపోవడం భక్తుల్లో ఆగ్రహానికి కారణమవుతోంది. నిత్యం వందలాది మంది భక్తులు దర్శనానికి తరలివస్తుండగా, ఆదివారం రోజుల్లో జరిగే సుదర్శన హోమం, కళ్యాణోత్సవం, అన్నదానం కార్యక్రమాలకు వేల సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారు. అయితే ఇలాంటి కీలక సమయంలో ఆలయ E.O అందుబాటులో లేకపోవడం, ఫోన్ కాల్స్‌కు స్పందించకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. భక్తులే చేస్తున్న సేవలు ప్రతినెల జరిగే గిరి ప్రదక్షిణకు ప్రభుత్వ సహాయం శూన్యం రూ.30 లక్షల వ్యయంతో రథాన్ని భక్తులే సమకూర్చారు రూ.20 లక్షలతో ఏకశిలా గరుత్మంతుని విగ్రహం భక్తుల విరాళాలతో నిర్మించారు సుదర్శన హోమం, కళ్యాణం, అన్నదానం కార్యక్రమాలు కూడా భక్తుల సహకారంతోనే కొనసాగుతున్నాయి ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి ఎండోమెంట్స్ శాఖ పేరుతో సంవత్సరానికి కోటి రూపాయలకుపైగా ఆదాయం వస్తున్నప్పటికీ— శాశ్వత E.O ఎందుకు నియమించడం లేదు? ఆలయ అభివృద్ధిపై పర్యవేక్షణ ఎందుకు లేదు? గత 10 సంవత్సరాల టెండర్లపై విచారణ ఎందుకు జరపడం లేదు? భక్తులు ప్రభుత్వాన్ని, సంబంధిత అధికారులను వెంటనే స్పందించాలని కోరుతున్నారు. “భక్తుల విశ్వాసాన్ని కాపాడండి.. స్థంభాద్రి గుట్టను అభివృద్ధి చేయండి” అంటూ డిమాండ్ చేస్తున్నారు.

ఖమ్మం /మే 10/
పున్నమి జిల్లా ప్రతి నిధి

ఖమ్మం నగరానికి ఆధ్యాత్మిక చిహ్నంగా నిలిచిన పవిత్ర స్తంభాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం నిర్వహణపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోట్లాది రూపాయల ఆదాయం వచ్చే ఈ దేవస్థానంలో ప్రాథమిక పరిపాలనా వ్యవస్థ సైతం సరిగా లేకపోవడం భక్తుల్లో ఆగ్రహానికి కారణమవుతోంది.

నిత్యం వందలాది మంది భక్తులు దర్శనానికి తరలివస్తుండగా, ఆదివారం రోజుల్లో జరిగే సుదర్శన హోమం, కళ్యాణోత్సవం, అన్నదానం కార్యక్రమాలకు వేల సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారు. అయితే ఇలాంటి కీలక సమయంలో ఆలయ E.O అందుబాటులో లేకపోవడం, ఫోన్ కాల్స్‌కు స్పందించకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

భక్తులే చేస్తున్న సేవలు

ప్రతినెల జరిగే గిరి ప్రదక్షిణకు ప్రభుత్వ సహాయం శూన్యం

రూ.30 లక్షల వ్యయంతో రథాన్ని భక్తులే సమకూర్చారు

రూ.20 లక్షలతో ఏకశిలా గరుత్మంతుని విగ్రహం భక్తుల విరాళాలతో నిర్మించారు

సుదర్శన హోమం, కళ్యాణం, అన్నదానం కార్యక్రమాలు కూడా భక్తుల సహకారంతోనే కొనసాగుతున్నాయి

ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి

ఎండోమెంట్స్ శాఖ పేరుతో సంవత్సరానికి కోటి రూపాయలకుపైగా ఆదాయం వస్తున్నప్పటికీ—

శాశ్వత E.O ఎందుకు నియమించడం లేదు?

ఆలయ అభివృద్ధిపై పర్యవేక్షణ ఎందుకు లేదు?

గత 10 సంవత్సరాల టెండర్లపై విచారణ ఎందుకు జరపడం లేదు?

భక్తులు ప్రభుత్వాన్ని, సంబంధిత అధికారులను వెంటనే స్పందించాలని కోరుతున్నారు.
“భక్తుల విశ్వాసాన్ని కాపాడండి.. స్థంభాద్రి గుట్టను అభివృద్ధి చేయండి” అంటూ డిమాండ్ చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.