కాంగ్రెస్పా ర్టీ బలోపేతంలో సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తోందని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి పమ్మి అశోక్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సోషల్ మీడియా చైర్మన్‌గా నియమితులైన పెట్టేం నవీన్‌ను గురువారం ఖమ్మంలోని సంజీవరెడ్డి భవన్లో మర్యాదపూర్వకంగా కలిసి పమ్మి అశోక్ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ విధానాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న అసత్య ప్రచారాలను వాస్తవాలతో తిప్పికొట్టాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. 2022లో రాష్ట్ర సోషల్ మీడియా కోఆర్డినేటర్‌గా పెట్టేం నవీన్, జిల్లా కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్‌గా పమ్మి అశోక్ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేశారని తెలిపారు. నవీన్ నాయకత్వంలో రాష్ట్ర సోషల్ మీడియా విభాగం మరింత సమర్థవంతంగా పనిచేసి బలమైన డిజిటల్ వ్యవస్థగా ఎదగాలని ఆకాంక్షించారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సోషల్ మీడియాను సద్వినియోగం చేసుకుని పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర సోషల్ మీడియా కోఆర్డినేటర్ వీరపురం రామలక్ష్మణ్, ఖమ్మం సిటీ కోఆర్డినేటర్ ఏలూరు రవి, తేజావత్ స్వామి, తెళ్ళూరి వీరయ్య, భూక్యా వెంకన్న, గోపి, ఇలప్రోలు వెంకటప్పయ్య తదితరులు పాల్గొన్నారు.




