పున్నమి ప్రతినిధి, రామచంద్రపురం
రామచంద్రపురం మండలం వెంకట్రామాపురం సమీపంలోని సెవెన్ హిల్స్ ఫార్మసీ కళాణశాలలో శనివారం నాడు హైదరాబాద్ చెందిన హెటిరో డ్రగ్స్ సంస్థ బి. ఫార్మసీ మరియు యం. ఫార్మసీ విద్యార్థులకు ప్రొటెక్షన్, నాణ్యత నిర్ధారణ మరియు ఔషధ నాణ్యత పరీక్ష అను విభాగాలలో ఉద్యోగాలకు ప్రాంగణ నియామకాలు నిర్వహించారు. ఈ నియామకాలలో హెటిరో డ్రగ్స్ సంస్థ తరపున హెచ్ ఆర్ మేనేజర్ అడవి రాముడు పాల్గొని విద్యార్థులకు రాత పరీక్ష మరియు మౌఖిక పరీక్ష ద్వారాం 20 మంది విద్యార్థులను ఉద్యోగాలకు ఎంపిక చేసారు. ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులకు కంపెనీ తరపున 2.8 లక్షలు వార్షిక వేతనంగా అందజేయనున్నట్లు కళాశాల అకడమిక్ డైరెక్టర్ లక్ష్మయ్య తెలిపారు. ఈ నియామకాలలో సుమారు 95 మంది విద్యార్థులు పాల్గొన్నారు.ఎంపికైన విద్యార్థులకు నియామక పత్రాలను అందచేసారు. ఈ కార్యక్రములో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ప్రసన్నరాజు, ప్లేస్మెంట్ కో-ఆర్డినేటర్ పవన్ కుమార్ పాల్గొన్నారు .




