ప్రతి ఒక సమస్యను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ
సూళ్లూరుపేట శాసనసభ్యురాలు నెలవల విజయ శ్రీ మంగళవారం కోటపోలూరు పంచాయతీలో విస్తృతంగా పర్యటించారు. తెదేపా రూరల్ ఉపాధ్యక్షులు, టిడిపి సీనియర్ నాయకులు సుధాకర్ రెడ్డి ఆయకట్టు సర్పంచ్ ముచ్చకాల రమణయ్య ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించి స్వాగతం పలికారు. ఎమ్మెల్యే అద్వానంగా ఉన్న కోటపోలూరు
R&B రోడ్డు పరిశీలించి రోడ్డు మరమ్మతులకు 44 లక్షలు మంజూరయ్యాయని తెలిపారు.కోటపోలూరులో శిథిలావస్థకు చేరుకున్న అంగనవాడి స్కూళ్లను, వాటర్ ట్యాంకులను పరిశీలించారు. పెద్దన్న గారి చెరువును పరిశీలించి పొలాలకు నీళ్లు సమృద్ధిగా ఉన్నాయా లేదా అని ఆయకట్ట సర్పంచ్ ముచ్చకాల రమణయ్య ను అడిగి తెలుసుకున్నారు.
చెరువుకు సంబంధించి ఎటువంటి సమస్య ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. కొరిడీ- పెర్నాడు రోడ్డు పనులు కూడా సర్వే పూర్తయిన వెంటనే రాకపోకలకు అంతరాయం లేకుండా పనులు మొదలవుతాయని, సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఉన్న ప్రతి సమస్యను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెదేపా రూరల్ అధ్యక్షులు పాకం వెంకటసుబ్బయ్య, మాజీ అధ్యక్షులు కొక్కు శంకరయ్య, గ్రామ అధ్యక్షులు మనోజ్ నాయుడు,ఎంబెటి రమేష్, కైలాసం కిషోర్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

కోటపోలూరులో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ విస్తృత పర్యటన
ప్రతి ఒక సమస్యను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ సూళ్లూరుపేట శాసనసభ్యురాలు నెలవల విజయ శ్రీ మంగళవారం కోటపోలూరు పంచాయతీలో విస్తృతంగా పర్యటించారు. తెదేపా రూరల్ ఉపాధ్యక్షులు, టిడిపి సీనియర్ నాయకులు సుధాకర్ రెడ్డి ఆయకట్టు సర్పంచ్ ముచ్చకాల రమణయ్య ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించి స్వాగతం పలికారు. ఎమ్మెల్యే అద్వానంగా ఉన్న కోటపోలూరు R&B రోడ్డు పరిశీలించి రోడ్డు మరమ్మతులకు 44 లక్షలు మంజూరయ్యాయని తెలిపారు.కోటపోలూరులో శిథిలావస్థకు చేరుకున్న అంగనవాడి స్కూళ్లను, వాటర్ ట్యాంకులను పరిశీలించారు. పెద్దన్న గారి చెరువును పరిశీలించి పొలాలకు నీళ్లు సమృద్ధిగా ఉన్నాయా లేదా అని ఆయకట్ట సర్పంచ్ ముచ్చకాల రమణయ్య ను అడిగి తెలుసుకున్నారు. చెరువుకు సంబంధించి ఎటువంటి సమస్య ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. కొరిడీ- పెర్నాడు రోడ్డు పనులు కూడా సర్వే పూర్తయిన వెంటనే రాకపోకలకు అంతరాయం లేకుండా పనులు మొదలవుతాయని, సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఉన్న ప్రతి సమస్యను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెదేపా రూరల్ అధ్యక్షులు పాకం వెంకటసుబ్బయ్య, మాజీ అధ్యక్షులు కొక్కు శంకరయ్య, గ్రామ అధ్యక్షులు మనోజ్ నాయుడు,ఎంబెటి రమేష్, కైలాసం కిషోర్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

