నాగర్ కర్నూల్ నియోజకవర్గం : నాగర్ కర్నూల్ మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా దగ్గర లో ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ….నీట్ (NEET-UG) పేపర్ లీక్ వ్యవహారానికి వ్యతిరేకంగా, ఢిల్లీలో విద్యార్థులకు మద్దతుగా ఆందోళన చేపట్టిన లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని అక్రమంగా అరెస్టు చేయడాన్ని మరియు విచక్షణారహితంగా విద్యార్థులపై లాఠీ ఛార్జ్ చేయడాన్ని, టియర్ గ్యాస్ ప్రయోగించడానికి నిరసిస్తూ పెద్ద ఎత్తున నిరసన (ధర్నా) కార్యక్రమం నిర్వహించి, దిష్టిబొమ్మ దగ్ధం చేసిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు.ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరియు మోడీ గారికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేసిన కాంగ్రెస్ శ్రేణులు.
అనంతరం ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారు మాట్లాడుతూ..నీట్ (NEET) పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని, విద్యార్థులపై లాఠీ ఛార్జ్ చేయడం, టియర్ గ్యాస్ ప్రయోగించడం అమానుషమని దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు, ప్రధాని మోడీ గారు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులను అక్రమంగా అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు, నీట్ పరీక్షల వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని, యువతకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు.
Uploaded Video:

