పెందుర్తి మండలం సారిపల్లి గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించారు. పోలీస్ కమిషనర్, విశాఖపట్నం సిపీ గారి ఆదేశాలు మరియు సూచనల మేరకు పెందుర్తి ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కె.వి. సతీష్ కుమార్ గారి ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది గ్రామంలో పర్యటించి, గ్రామస్తులతో మమేకమై వారి సమస్యలను తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ కె.వి. సతీష్ కుమార్ గారు గ్రామంలోని పెద్దలు, మహిళలు, యువత, ప్రజాప్రతినిధులు మరియు ఇతర ముఖ్య వ్యక్తులతో సమావేశమై గ్రామంలో నెలకొన్న పరిస్థితులు, స్థానిక సమస్యలు, వివాదాలు, శాంతిభద్రతలకు సంబంధించిన అంశాలపై ఆరా తీశారు.స్థానిక సంస్థల ఎన్నికలపై అవగాహనరానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామంలో ఎలాంటి వివాదాలు, గ్రూపు విభేదాలు లేదా అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని పోలీసులు సూచించారు. ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.ఎన్నికల సమయంలో వదంతులను నమ్మవద్దని, సోషల్ మీడియాలో వచ్చే నిర్ధారణ లేని సమాచారాన్ని ఫార్వర్డ్ చేయవద్దని, ఇతరులను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయవద్దని సూచించారు. గ్రామంలో ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు.మత్తు పదార్థాలు, సైబర్ నేరాలపై అవగాహనఈ సందర్భంగా యువతకు మత్తు పదార్థాల దుష్ప్రభావాలు మరియు వాటి వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. గ్రామంలో మత్తు పదార్థాల విక్రయం, వినియోగం లేదా అనుమానాస్పద కార్యకలాపాలపై సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని సూచించారు.అలాగే సైబర్ నేరాలు, OTP మోసాలు, ఆన్లైన్ పెట్టుబడి మోసాలు, నకిలీ ఉద్యోగాలు, బ్యాంక్ మరియు UPI మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ OTP, PIN, పాస్వర్డ్ లేదా బ్యాంక్ వివరాలను ఇతరులతో పంచుకోవద్దని ప్రజలకు అవగాహన కల్పించారు.మహిళలు, బాలికల భద్రతకు ప్రాధాన్యతమహిళలు మరియు బాలికల భద్రతకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపించినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. పిల్లలు సోషల్ మీడియాను ఉపయోగించే సమయంలో తల్లిదండ్రులు తగిన పర్యవేక్షణ చేయాలని సూచించారు.పల్లె నిద్రలో భాగంగా పోలీసు సిబ్బంది రాత్రి సమయంలో గ్రామంలో పెట్రోలింగ్ నిర్వహించి, సున్నితమైన ప్రాంతాలను పరిశీలించారు. ప్రజల నుంచి వచ్చిన సమస్యలు, సూచనలు మరియు ముఖ్యమైన సమాచారాన్ని నమోదు చేసుకుని, అవసరమైన చోట చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.“పోలీసులు ప్రజలకు దూరంగా ఉండే వ్యవస్థ కాదు.. ప్రజల మధ్యకు వచ్చి వారి సమస్యలను తెలుసుకుని, వారి భద్రతకు అండగా నిలిచే వ్యవస్థ” అనే నమ్మకాన్ని ప్రజల్లో మరింత బలోపేతం చేయడమే పల్లె నిద్ర కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ఇన్స్పెక్టర్ కె.వి. సతీష్ కుమార్ తెలిపారు.గ్రామంలో ఐకమత్యం, శాంతి, సోదరభావం కొనసాగిస్తూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలీసులకు సహకరించాలని ఆయన గ్రామస్తులను కోరారు.


