Thursday, 17 September 2026
  • Home  
  • సాయిధ పోరాట స్ఫూర్తితో ఉద్యమించాలి: సీపీఎం జిల్లా నాయకులు ఈసంపెల్లి బాబు
- వరంగల్

సాయిధ పోరాట స్ఫూర్తితో ఉద్యమించాలి: సీపీఎం జిల్లా నాయకులు ఈసంపెల్లి బాబు

నర్సంపేట: వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలలో భాగంగా సీపీఎం నర్సంపేట పట్టణ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ప్రత్యేక సభ నిర్వహించారు. సీపీఎం పట్టణ కార్యదర్శి, 10వ వార్డు కౌన్సిలర్ హన్మకొండ శ్రీధర్ అధ్యక్షతన జరిగిన ఈ సభకు సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ఈసంపెల్లి బాబు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ​భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం సాగిన సాయుధ పోరాటం ద్వారా 10 లక్షల ఎకరాల భూమిని సాధించి పేదలకు పంచామని, 4 వేల మంది త్యాగాల పునాదులపై నిర్మితమైన ఈ పోరాటానికి కమ్యూనిస్టులే నిజమైన వారసులని బాబు స్పష్టం చేశారు. నేటి పెట్టుబడిదారీ, కార్పొరేట్ విధానాలపై రైతులు, కార్మికులు అదే స్ఫూర్తితో తిరగబడాలని పిలుపునిచ్చారు. ​మరో నాయకుడు కోరబోయిన కుమారస్వామి మాట్లాడుతూ.. కులమతాలకు అతీతంగా జరిగిన చారిత్రక పోరాటాన్ని బీజేపీ మత రాజకీయాల కోసం వక్రీకరిస్తోందని విమర్శించారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు బెంబేలి మాలహాల్ రావు, గడ్డమీది బాలకృష్ణ, కందికొండ రాజు, ఎండీ ఫరీదా, వజ్జంతీ విజయ, కలకోట అనిల్, ఉదయగిరి నాగమణి తదితరులు పాల్గొన్నారు.

నర్సంపేట: వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలలో భాగంగా సీపీఎం నర్సంపేట పట్టణ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ప్రత్యేక సభ నిర్వహించారు. సీపీఎం పట్టణ కార్యదర్శి, 10వ వార్డు కౌన్సిలర్ హన్మకొండ శ్రీధర్ అధ్యక్షతన జరిగిన ఈ సభకు సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ఈసంపెల్లి బాబు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
​భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం సాగిన సాయుధ పోరాటం ద్వారా 10 లక్షల ఎకరాల భూమిని సాధించి పేదలకు పంచామని, 4 వేల మంది త్యాగాల పునాదులపై నిర్మితమైన ఈ పోరాటానికి కమ్యూనిస్టులే నిజమైన వారసులని బాబు స్పష్టం చేశారు. నేటి పెట్టుబడిదారీ, కార్పొరేట్ విధానాలపై రైతులు, కార్మికులు అదే స్ఫూర్తితో తిరగబడాలని పిలుపునిచ్చారు.
​మరో నాయకుడు కోరబోయిన కుమారస్వామి మాట్లాడుతూ.. కులమతాలకు అతీతంగా జరిగిన చారిత్రక పోరాటాన్ని బీజేపీ మత రాజకీయాల కోసం వక్రీకరిస్తోందని విమర్శించారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు బెంబేలి మాలహాల్ రావు, గడ్డమీది బాలకృష్ణ, కందికొండ రాజు, ఎండీ ఫరీదా, వజ్జంతీ విజయ, కలకోట అనిల్, ఉదయగిరి నాగమణి తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.