Tuesday, 18 August 2026
  • Home  
  • సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలను కొనసాగించాలి – ఘనంగా పాపన్న జయంతి వేడుకలు – విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
- మేడ్చల్ – మల్కాజిగిరి

సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలను కొనసాగించాలి – ఘనంగా పాపన్న జయంతి వేడుకలు – విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

మేడ్చల్ (పున్నమి ప్రతినిధి – సందీప్): బహుజనుల హక్కులు, ఆత్మగౌరవం కోసం పోరాడిన మహనీయుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. ​చిల్కానగర్ డివిజన్‌లోని నోవా ఫంక్షన్ హాల్ ప్రాంగణంలో నేర్ధం భాస్కర్ గౌడ్, సత్యరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, రాష్ట్ర నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్‌తో కలిసి పాపన్న విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ​ఈ సందర్భంగా ఎమ్మెల్యే ಮಾತలాడుతూ… నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ధీరోదాత్తంగా పోరాడిన బహుజన విప్లవ వీరుడు సర్వాయి పాపన్న అని కొనియాడారు. ఆయన సాగించిన ఉద్యమ స్ఫూర్తి, చేసిన త్యాగాలు సమాజానికి ఎల్లప్పుడూ మార్గదర్శకమని పేర్కొన్నారు. ​వేడుకల సందర్భంగా ప్రాంగణమంతా “జై సర్వాయి పాపన్న” నినాదాలతో హోరెత్తింది. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, గౌడ సంఘాల ప్రతినిధులు, మహిళలు మరియు చిల్కానగర్ డివిజన్ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

మేడ్చల్ (పున్నమి ప్రతినిధి – సందీప్):
బహుజనుల హక్కులు, ఆత్మగౌరవం కోసం పోరాడిన మహనీయుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు.
​చిల్కానగర్ డివిజన్‌లోని నోవా ఫంక్షన్ హాల్ ప్రాంగణంలో నేర్ధం భాస్కర్ గౌడ్, సత్యరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, రాష్ట్ర నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్‌తో కలిసి పాపన్న విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
​ఈ సందర్భంగా ఎమ్మెల్యే ಮಾತలాడుతూ… నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ధీరోదాత్తంగా పోరాడిన బహుజన విప్లవ వీరుడు సర్వాయి పాపన్న అని కొనియాడారు. ఆయన సాగించిన ఉద్యమ స్ఫూర్తి, చేసిన త్యాగాలు సమాజానికి ఎల్లప్పుడూ మార్గదర్శకమని పేర్కొన్నారు.
​వేడుకల సందర్భంగా ప్రాంగణమంతా “జై సర్వాయి పాపన్న” నినాదాలతో హోరెత్తింది. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, గౌడ సంఘాల ప్రతినిధులు, మహిళలు మరియు చిల్కానగర్ డివిజన్ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.