సరికొత్త చరిత్ర లిఖించిన ప్రధాని నరేంద్ర మోడీ. అత్యధిక కాలం ఎన్నికైన ప్రధానిగా పదవిలో కొనసాగిన రికార్డు. 4,399 రోజుల పాటు పీఎంగా కొనసాగిన మోడీ. అంతకు ముందు నెహ్రూ పేరిట ఉన్న రికార్డు. నెహ్రూ రికార్డును తిరగరాసిన నరేంద్ర మోడీ.
2014 మే 26న ఆయన తొలిసారిగా ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి నిరంతరాయంగా ప్రజలచే ఎన్నుకోబడిన ప్రధానిగా అత్యధిక కాలం పనిచేసిన వ్యక్తిగా నిలిచారు.
జూన్ 10, 2026 నాటికి మోదీ నిరంతరాయంగా 4,399 రోజులు పదవిలో కొనసాగి, దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును అధిగమించారు.
ఎన్నుకోబడిన ప్రధానుల వరుస పదవీకాలం పరంగా, నెహ్రూ (4,398 రోజులు), ఇందిరా గాంధీ (4,077 రోజులు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
నా క్యాబినెట్ సహచరులకు కృతజ్ఞతలు! 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షల మేరకు మార్గనిర్దేశం చేస్తూ విక్షిత్ భారత్ కోసం మా ప్రయత్నాలు మరింత శక్తివంతంగా కొనసాగుతాయి అని నరేంద్ర మోడీ చెప్పారు
Uploaded Video:

