శ్రీకాళహస్తి, ఏప్రిల్ 13 (పున్నమి టెంపుల్ న్యూస్) శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని పాట్నా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనుపమ చక్రవర్తి సోమవారం దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆమెకు ఆలయ అధికారులు సాదరంగా ఆహ్వానం పలికారు. అనంతరం న్యాయమూర్తి అనుపమ చక్రవర్తి కుటుంబ సభ్యులకు ఆలయ అధికారులు ప్రత్యేకంగా రూ. 5,000/- రాహు-కేతు నివారణ పూజలు, అంతరాలయ దర్శన భాగ్యం కల్పించారు. స్వామి, అమ్మవార్ల దర్శనం అనంతరం శ్రీ మేధా దక్షిణామూర్తి సన్నిధిలో వేద పండితులు ఆమెకు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు స్వామివారి శేషవస్త్రం, తీర్థప్రసాదాలు మరియు చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రోటోకాల్ ఏఈఓ మోహన్, ఏపీఆర్వో రవి మరియు స్థానిక కోర్టు సిబ్బంది పాల్గొని ఏర్పాట్లను పర్యవేక్షించారు.

శ్రీకాళహస్తీశ్వర స్వామి చెంత పాట్నా హైకోర్టు న్యాయమూర్తి అనుపమ చక్రవర్తి