Saturday, 20 June 2026
  • Home  
  • శ్రీకాళహస్తిలో ‘నొస్టిక్’ ఫ్రూట్ ఐస్‌క్రీమ్ షాప్ ప్రారంభించిన ఎమ్మెల్యే సతీమణి
- తిరుపతి

శ్రీకాళహస్తిలో ‘నొస్టిక్’ ఫ్రూట్ ఐస్‌క్రీమ్ షాప్ ప్రారంభించిన ఎమ్మెల్యే సతీమణి

శ్రీ కాళహస్తి, జూన్ 19, (పున్నమి న్యూస్) : శ్రీకాళహస్తి పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘నొస్టిక్ నాచురల్ ఫ్రూట్ ఐస్‌క్రీమ్ షాప్‌’ను శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషితా రెడ్డి శుక్రవారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా షాప్ నిర్వాహకుడు షోకత్‌కు ఆమె అభినందనలు తెలియజేస్తూ వ్యాపారాభివృద్ధికి శుభాకాంక్షలు అందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. కృత్రిమ రంగులు, రసాయనాలు లేకుండా సహజ సిద్ధమైన పండ్లతో తయారుచేసిన ఆరోగ్యకరమైన ఐస్‌క్రీమ్‌లను ప్రజలకు అందించాలనే లక్ష్యంతో ఈ సంస్థ ప్రారంభం కావడం అభినందనీయమని అన్నారు. నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తూ వినియోగదారుల విశ్వాసాన్ని పొందాలని, భవిష్యత్తులో సంస్థ మరింత విస్తరించి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, అభిమానులు, వ్యాపారవేత్తలు మరియు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. కొత్తగా ప్రారంభమైన ఈ షాప్ ప్రజల ఆదరణను పొందుతూ విజయవంతంగా ముందుకు సాగాలని వారు నిర్వాహకుడు షోకత్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.