శ్రీ కాళహస్తి, జూన్ 23, (పున్నమి న్యూస్) : భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు, అఖండ భారత దేశం కోసం ప్రాణాలర్పించిన మహనీయుడు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతిని పురస్కరించుకుని బెరివారి మండపం కూడలి వద్ద మంగళవారం ఉదయం బలిదాన్ దివస్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన ముఖర్జీ చిత్రపటానికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ సమైక్యత, సమగ్రత కోసం ముఖర్జీ చేసిన త్యాగాలను స్మరించుకున్నారు. జమ్మూకాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తికి వ్యతిరేకంగా పోరాడి, దేశంలో ఒకే రాజ్యాంగం, ఒకే జెండా ఉండాలన్న లక్ష్యంతో ఆయన 1951లో భారతీయ జనసంఘ్‌ను స్థాపించారని గుర్తుచేశారు. కాశ్మీర్లో ప్రవేశానికి ఉన్న పర్మిట్ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఎలాంటి అనుమతి లేకుండా అక్కడికి వెళ్లిన ముఖర్జీని 1953 మే 11న అరెస్ట్ చేశారని, అనంతరం జూన్ 23న శ్రీనగర్ జైలులో అనుమానాస్పద స్థితిలో మరణించారని చెప్పారు. ఆయన మరణం ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిందన్నారు. ఆర్టికల్ 370ని రద్దు చేయాలనే ఉద్యమ క్రమంలోనే ఆయన బలిదానం జరిగిందని, ప్రస్తుత ప్రధానమంత్రి ఆ ఆర్టికల్‌ను రద్దు చేసి ముఖర్జీ ఆశయాలను నెరవేరుస్తూ ఆయనకు నిజమైన నివాళి అర్పించారని కోలా ఆనంద్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక పార్టీ నాయకులు, జిల్లా ఉపాధ్యక్షులు మేళాగారం సుబ్రమణ్యం రెడ్డి, బీసీ సంఘం అధ్యక్షులు ఎస్వీ రమణ, ఏరియా ఆసుపత్రి సభ్యులు గరికపాటి రమేష్, జిల్లా అధికార ప్రతినిధి కొండేటి గోపాల్, మండల అధ్యక్షులు ఆర్. హరీష్ రెడ్డి, వేడాం కృష్ణయ్య, భాగర్తి వెంకటేష్, జిల్లా మహిళామోర్చా అధ్యక్షురాలు ప్రజ్ఞశ్రీ, కిస్సాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కునాటి నాగరాజు, సీనియర్ నాయకులు జివి అమర్నాద్, పుణ్యం డిల్లి కుమార్ రెడ్డి, రాం ఉమాసింగ్, మద్దు వాసు యాదవ్, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

శ్రీకాళహస్తిలో ఘనంగా డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్