శ్రీ కాళహస్తి, జూన్ 23, (పున్నమి న్యూస్) : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ ఆశయాల సాధనలో భాగంగా స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్ వద్ద పేట బ్రదర్స్ ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పవన్ కళ్యాణ్ సేవా దృక్పథాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో జనసేన నాయకులు ఈ సేవా కార్యక్రమాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా 85వ వారానికి చేరిన ఈ అన్నదానంలో వందలాది మంది పేదలు, బాటసారులకు జనసేన నాయకులు భోజన వసతి కల్పించారు. సమాజంలో ఆకలితో ఉన్నవారికి అండగా నిలవడమే పవన్ కళ్యాణ్ ప్రధాన ఆశయమని, దానికి కట్టుబడి ఈ అన్నదానాన్ని ప్రతి వారం విజయవంతంగా నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పేట చంద్రశేఖర్, పేట చిరంజీవి, గంధం శీను, మనీ, లక్ష్మణ్, ప్రదీప్ కుమార్, కళ్లిపూడి వెంకటేష్, డాక్టర్ నక్క ప్రసాద్, హరి, ఆరిఫ్, మహర్షి రెడ్డి, నవీన్, చందు, పసల ఎలిషా, రాజా పాల్గొన్నారు. అలాగే శ్రీకాళహస్తి టౌన్ బ్యాంక్ డైరెక్టర్ కవిత, పేట శారద, నారాయణ గాయత్రి, బత్తెమ్మ, ప్రత్యూష తదితర వీర మహిళలు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

శ్రీకాళహస్తిలో 85వ వారం డొక్కా సీతమ్మ అన్నదానం